ETV Bharat / international

కరోనాతో ఆమెకు ఊరట- ఉరిశిక్ష వాయిదా - లిసా మాంట్​గోమరీ

అమెరికాలో ఓ మహిళకు మరణ శిక్షను అమలు చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది ఫెడరల్​ కోర్టు. ఆమె తరఫు న్యాయవాదులు కరోనా బారిన పడగా.. ఈ నిర్ణయం తీసుకుంది.

Judge halts federal execution after lawyers contract virus
60 ఏళ్ల తర్వాత విధిస్తున్న మరణ శిక్ష.. వాయిదా
author img

By

Published : Nov 20, 2020, 4:14 PM IST

దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత మొదటిసారి ఓ మహిళకు విధిస్తున్న మరణశిక్షను అమెరికా ఫెడరల్​ కోర్టు తాత్కాలికంగా వాయిదా వేసింది. సదరు మహిళా దోషి తరఫు న్యాయవాదులు.. కరోనా వైరస్​ బారిన పడగా ఫెడరల్​ న్యాయమూర్తి ఈ నిర్ణయం తీసుకున్నారు.

'లిసా మాంట్​గోమరీ' అనే మహిళకు డిసెంబర్​ 8న ఇండియానాలోని టెర్రె హాట్ కారాగారంలో మరణ శిక్ష విధించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. కానీ, ఆమె తరఫున వాదించే కెల్లీ హెన్రీ, అమీ హార్వెల్ అనే ఇద్దరు న్యాయవాదులకు కొవిడ్​ పాజిటివ్​గా తేలింది.

మాంట్​గోమరీ తీవ్రమైన మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని న్యాయవాదులు కెల్లీ, హార్వెల్​ చెబుతున్నారు. తనంతట తానుగా క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేసే పరిస్థితుల్లో మాంట్​గోమరీ లేదని అంటున్నారు. తన మానసిక సమస్య కారణంగా మరే ఇతర న్యాయవాదులను మాంట్​గోమరీ విశ్వసించడం లేదని వారు కోర్టుకు తెలిపారు. తాము కరోనా బారిన పడ్డ ఈ పరిస్థితుల్లో ఆమెకు శిక్షను వాయిదా వేయాల్సిందిగా న్యాయస్థానాన్ని కోరారు. న్యాయమూర్తి అందుకు సానుకూలంగా స్పందించారు.

2004లో ఓ గర్భణీని గొంతునులిమి చంపి.. ఆమె కడుపును కోసి శిశువును తీసుకు వెళ్లిందనే నేరంలో మాంట్​గోమరీ దోషిగా తేలింది. న్యాయస్థానం ఆమెకు మరణ శిక్ష విధించింది. దాదాపు 60 ఏళ్ల తర్వాత అమెరికాలో మరణ శిక్ష పడ్డ తొలి మహిళగా మాంట్​గోమరీ నిలిచింది.

ఎనిమిదో మరణశిక్ష..

మరో ఘటనలో.. ఓ పదహారేళ్ల బాలికను కిడ్నాప్​ చేసి, అతి కిరాతకంగా హత్యాచారానికి పాల్పడిన కేసులో దోషిని ఉరితీయడానికి అమెరికా సుప్రీం కోర్టు మార్గం సుగమం చేసింది. 1994లో ఈ లీసా రేనా అనే బాలికపై ఐదుగురు వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.

దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ట్రంప్​ హయాంలో ఉరిశిక్షలను అమలు చేయడం ప్రారంభమైంది. ఈ ఏడాది ఇది ఎనిమిదో మరణ శిక్ష.

ఇదీ చూడండి:'బాధ్యతా రాహిత్య అధ్యక్షుడిగా ట్రంప్​ నిలిచిపోతారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.