ETV Bharat / international

Corona: మెదడుపైనా మహమ్మారి ప్రభావం

author img

By

Published : Jun 24, 2021, 8:51 AM IST

మహమ్మారితో బాధపడిన వారిలో మతిమరుపు, కుంగుబాటు వంటి లక్షణాలు కనిపించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీర్ఘకాలంగా కొవిడ్‌ సమస్యలతో బాధపడుతున్న వారిలో మెదడు వాపు ప్రక్రియ ప్రభావం తీవ్రంగా ఉందని తేల్చారు.

COVID effect on BRAIN
మెదడుపై కరోనా ప్రభావం

కొవిడ్‌-19 మెదడుపై కూడా ప్రభావం చూపుతుందా.. అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. తీవ్ర కరోనాతో చనిపోయిన వారిలో పార్కిన్సన్స్‌, అల్జీమర్స్‌ మృతుల్లో కనిపించే రీతిలో మెదడులో వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్‌), నాడీ క్షీణత కనిపించిందని అమెరికాకు చెందిన స్టాన్‌ఫోర్డ్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసన్‌, జర్మనీకి చెందిన సార్లాండ్‌ యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది.

దీర్ఘకాలంగా కొవిడ్‌ సమస్యలతో బాధపడుతున్న వారిలో ఈ వాపు ప్రక్రియ ప్రభావం తీవ్రంగా ఉందని వీరి పరిశోధనలో తేలింది. కొవిడ్‌-19తో ఆసుపత్రి పాలైన వారిలో మూడింట ఒక వంతు మందిలో అస్తవ్యస్త ఆలోచనలు, మతిమరుపు, ఏకాగ్రత లోపం, కుంగుబాటు కనిపించాయని స్టాన్‌ఫోర్ట్‌ ప్రొఫెసర్‌ టోనీ కోరే తెలిపారు.

అయితే ఈ వ్యాధితో చనిపోయిన వారి మెదడులో సార్స్‌-కోవ్‌-2 సంకేతాలు ఎక్కడా కనిపించలేదని పేర్కొన్నారు. "తీవ్రమైన కొవిడ్‌-19తో చనిపోయిన రోగులకు నాడీ సంబంధిత జబ్బులు లేకపోయినా.. మెదడులో వాపు ప్రక్రియకు సంబంధించిన కణ సూచీలు కనబడ్డాయి" అని కోరే తెలిపారు. వీరి పరిశోధనను 'జర్నల్‌ నేచర్‌' ప్రచురించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.