అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. తాజాగా.. రిపబ్లికన్ కన్వెన్షన్‌లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రసంగంతో.. డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్‌కు మద్దతు తగ్గుతోందని పోల్స్ చెబుతున్నాయి.
ది హిల్ నివేదించిన మార్నింగ్ కన్సల్ట్ సర్వే ప్రకారం.. ప్రస్తుతం బైడెన్‌కు 50శాతం అమెరికన్ల మద్దతుంది. ట్రంప్‌నకు 44శాతం. ఎవరికి ఓటు వేయాలో ఇంకా తేల్చుకోని వారిది 7శాతం. అయితే రిపబ్లికన్ కన్వెన్షన్ ప్రారంభమయ్యే నాటికి(ఆగస్టు 23) ట్రంప్‌పై బైడన్‌కు 52-42 లీడ్ ఉంది.
ట్రంప్‌నకు కొంత మద్దతు పెరిగినప్పటికీ.. ఆయనపై బైడన్ ఆధిపత్యం చెలాయిస్తున్నట్టు ఈ పోల్ స్పష్టం చేస్తోంది.
అయితే రిపబ్లికన్ కన్వెన్షన్ ట్రంప్‌నకు సహాయపడిందని ది హిల్ పేర్కొంది. తన ప్రసంగంతో శ్వేతజాతి ఓటర్ల మద్దతును ట్రంప్ మరింత పొందినట్టు వెల్లడించింది.
ఇదీ చూడండి:- డొనాల్డ్ ట్రంప్ ప్రసంగంపై నిపుణులు ఏమన్నారంటే..?