ETV Bharat / international

బైడెన్​, జిన్​పింగ్ భేటీ- కీలక అంశాలపై చర్చ! - అమెరికా చైనా అధ్యక్షుల సమావేశం

అమెరికా-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఇరు దేశాల అధినేతలు(biden xi meeting) సోమవారం సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలు సహా పలు కీలక అంశాలపై జో బైడెన్​, జిన్​పింగ్ చర్చించినట్లు తెలుస్తోంది. తన పాత మిత్రుడ్ని కలవవడం చాలా సంతోషంగా ఉందని ఈ భేటీలో జిన్​పింగ్​ పేర్కొన్నారు.

biden jinping meeting
బైడెన్​, జిన్​పింగ్ భేటీ
author img

By

Published : Nov 16, 2021, 6:34 AM IST

Updated : Nov 16, 2021, 10:15 AM IST

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​, చైనా అధ్యక్షుడు జీ జిన్​పింగ్ మధ్య సోమవారం కీలక భేటీ జరిగింది(biden xi meeting). వర్చువల్​గా సమావేశమైన ఇరువురు నేతలు(biden xi meeting) పలు కీలక అంశాలపై చర్చించారు.

ఇరు దేశాల మన మధ్య నెలకొన్న పోటీనీ ఘర్షణపూరితంగా మారకుండా చూసే బాధ్యత తమపై ఉందని ఈ భేటీ ప్రారంభంలో జిన్​పింగ్​తో బైడెన్ అన్నారు.

తన పాత మిత్రుడ్ని కలవడం సంతోషంగా ఉందని జిన్​పింగ్​ బైడెన్​తో అన్నారు. అమెరికా-చైనా సంబంధాలు మెరుగుపరుచుకునే దిశగా తాను బైడెన్​తో కలిసి పని చేయడానికి కట్టుబడి ఉన్నానని తెలిపారు. "చైనా, అమెరికా పరస్పరం గౌరవించుకోవాలి. శాంతి నెలకొల్పేందుకు కృషి చేయాలి. ఇరు దేశాల విజయంలో సహకారం అందించుకోవాలి" అని బైడెన్​తో జిన్​పింగ్ చెప్పారు.

ఇదే తొలిసారి..

గతంలో బైడెన్ అమెరికా ఉపాధ్యక్షునిగా ఉన్న సమయంలో చైనా ఉపాధ్యక్షునిగా ఉన్న జిన్​పింగ్​ను బీజింగ్​లో కలిశారు. ఇద్దరు కలిసి నూడిల్స్ కూడా తిన్నారు. సరదా సంభాషణ జరిపారు. ఫిబ్రవరి, సెప్టెంబర్​లో ఇరువురూ ఫోన్​లో సుదీర్ఘంగా సంభాషించారు. అయితే అధ్యక్ష హోదాలో వారివురూ అధికారికంగా సమావేశమవడం ఇదే తొలిసారి.

ఇదీ చూడండి: డ్రాగన్‌ నియంత్రణకు అమెరికా వ్యూహం- ఆచితూచి భారత్​!

Last Updated : Nov 16, 2021, 10:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.