ETV Bharat / international

అమెరికా నూతన కథను లిఖిద్దాం రండి: బైడెన్

అమెరికన్లకు సేవ చేసేందుకు సర్వం ధారపోస్తానని అధ్యక్షుడు జో బైడెన్‌ వెల్లడించారు. అందరం కలిసి అగ్రరాజ్య కథను లిఖిద్దామని పిలుపునిచ్చారు. రాజ్యాంగానికి కట్టుబడి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తానని  బైడెన్‌ హామీనిచ్చారు.

Joe Biden speech as a President of the United States of America.

author img

By

Published : Jan 20, 2021, 11:20 PM IST

Updated : Jan 21, 2021, 12:16 AM IST

అమెరికా 46వ అధ్యక్షుడిగా బైడెన్‌ ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అమెరికాలో ప్రజాస్వామ్యం బలంగా ఉందని బైడెన్​ అన్నారు. ఇటీవల క్యాపిటల్​పై దాడి జరగడం దురదృష్టకరమన్నారు. ఇప్పటి వరకు అమెరికా ఎన్నో సవాళ్లు అధిగమించిందని అధ్యక్షునిగా తన తొలి ప్రసంగంలో పేర్కొన్నారు.

"నేను మన రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తాను. అమెరికాను కాపాడతాను.

మీ (అమెరికన్ల) కోసం సర్వం ధారపోస్తాను. మీకు సేవ చేసేందుకు చేయగలిగినదంతా చేస్తాను. నేను శక్తి గురించి ఆలోచించడం లేదు. అవకాశాల కోసం ఆలోచిస్తున్నాను.

నా వ్యక్తిగత అవసరాల కోసం కాదు ప్రజల మంచి గురించి యోచిస్తున్నాను. మనందరం కలిసి అమెరికా కథను లిఖిద్దాం. భయంతో కాదు ఆశతో.. విభజనతో కాదు ఐక్యతతో... చీకటితో కాదు వెలుగుతో రాద్దాం. మర్యాద, గౌరవం, ప్రేమ, పునరుత్తేజం, గొప్పతనం, మంచితనంతో అమెరికా నూతన కథను లిఖిద్దాం."

- జో బైడెన్‌, అమెరికా అధ్యక్షుడు

" ప్రజాస్వామ్యం అత్యంత విలువైందని అమెరికా నమ్మింది. మంచి ప్రపంచం కోసం మనమందరం పాటుపడాలి. అమెరికాను అన్ని విధాలా మెరుగు పరచాల్సిన అవసరం ఉంది. కరోనా సంక్షోభ సమయంలో నా ప్రమాణం చారిత్రక ఘటనగా మిగిలిపోతుంది. ఉపాధ్యక్షురాలిగా కమలాహారిస్ ప్రమాణం అమెరికాకే గర్వకారణం. దేశాభివృద్ధిలో ప్రతిఒక్క అమెరికన్‌ చేయూతనివ్వాలి. దేశీయ ఉగ్రవాదంపై తప్పనిసరిగా విజయం సాధిస్తాం."

- జో బైడెన్​, అమెరికా అధ్యక్షుడు

అగ్రరాజ్యాన్ని ఐక్యంగా ఉంచడమే తన ప్రథమ ప్రాధాన్యమని బైడెన్‌ తెలిపారు. అమెరికా ప్రజల భవిష్యత్‌ను సుస్థిరం చేసేందుకు ప్రజాస్వామ్యంలోని అన్ని అంశాలు అవసరమని ఆయన ఉద్ఘాటించారు. ద్వేషం, అతివాదం, హింస, నిరుద్యోగం వంటి అంశాలపై కలిసికట్టుగా పోరాడాలని చెప్పారు.

Last Updated : Jan 21, 2021, 12:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.