ETV Bharat / international

ఆ విషయాల్లో చైనాపై బైడెన్ కఠిన వైఖరే!

author img

By

Published : Nov 19, 2020, 2:38 PM IST

అమెరికా తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్.. చైనా విషయంలో కఠినంగానే వ్యవహరిస్తారని తెలుస్తోంది. వీగర్లపై అకృత్యాలు, హాంకాంగ్​లో దౌర్జన్యాలపై తీవ్రమైన వైఖరి అవలంబించే అవకాశం ఉంది. చైనాను టార్గెట్​ చేస్తూ.. ఉదార ప్రజాస్వామ్య దేశాలను ఏకతాటిపైకి తీసుకొచ్చే వీలుంది.

Joe Biden expected to take up a tough stance against China
ఆ విషయాల్లో చైనాపై బైడెన్ కఠిన వైఖరే!

డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో అమెరికా, చైనా మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చైనాపై ట్రంప్ కఠిన వైఖరినే అవలంబించారు. అయితే మైనారిటీలపై చైనా అకృత్యాలు, వీగర్లపై దౌర్జన్యాలపై ట్రంప్ పెద్దగా స్పందించలేదు. వాణిజ్య యుద్ధం తర్వాత నిర్వహించిన చర్చల్లో ప్రయోజనం పొందేందుకే హాంకాంగ్, షింజియాంగ్​లోని చైనా అకృత్యాలపై ట్రంప్ మౌనంగా ఉన్నారని ఒట్టావా సిటిజన్​ అనే కెనడా పత్రికలో కథనం ప్రచురితమైంది. అందుకే చైనాను జవాబుదారీగా ఉంచకుండా ట్రంప్​ వెనక్కి తగ్గినట్లు ఆ కథనంలో టెర్రీ గ్లావిన్ అనే పాత్రికేయుడు చెప్పుకొచ్చారు.

రెండేళ్ల క్రితమే జిన్​పింగ్​ను పొగుడుతూ ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. "నేను, జిన్​పింగ్ ఎప్పటికీ స్నేహితులుగా ఉంటాం. ఆయన చైనా కోసం ఉన్నారు, నేను అమెరికా కోసం ఉన్నాను. అది పక్కనబెడితే మేం ఒకరికొకరం ఆప్యాయంగా ఉంటాం." అంటూ చెప్పుకొచ్చారు.

కానీ బైడెన్ అలా కాదు..

అయితే అమెరికా తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్.. మైనార్టీలు, మానవ హక్కులకు సంబంధించిన విషయాల్లో చైనా అనుసరించే విధానాల పట్ల కఠిన వైఖరితోనే ఉంటారని గ్లావిన్ పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​ను దుండగుడి(థగ్)గా అభివర్ణించిన బైడెన్​.. ఆ దేశానికి దీటుగా నిలబడేలా దీర్ఘకాల వ్యూహంతో అమెరికా మిత్ర పక్షాలను ఏకం చేయనున్నట్లు చెప్పుకొచ్చారు.

ట్రంప్ మెతక వైఖరి అవలంబించిన విషయాలపై బైడెన్ దీటుగా స్పందించారని గ్లావిన్ తెలిపారు. ముస్లింలను సామూహికంగా నిర్బంధించడం, వీగర్ సంస్కృతిని అణచివేయడాన్ని మారణహోమంగా పేర్కొన్నారని ఆ కథనంలో వివరించారు పాత్రికేయుడు టెర్రీ గ్లావిన్.

చైనాపై దేశాల ఆగ్రహం..

అమెరికాలో ప్రభుత్వ వైఖరి వల్ల ప్రపంచంలోని ఉదార ప్రజాస్వామ్య(లిబరల్ డెమొక్రసీ) దేశాలు చైనా విషయంలో ఏకతాటిపై ఉండలేకపోయాయి. హాంకాంగ్, షింజియాంగ్​లతో పాటు ఐరాస ఏజెన్సీలను చైనా తనకు అనుకూలంగా మార్చుకోవడం, ప్రపంచ వాణిజ్య సంస్థను దుర్వినియోగం చేయడం, ఇతర దేశాల అంశాల్లో జోక్యం చేసుకొనే విధానాలు ప్రస్తుతం సమస్యాత్మకంగా ఉన్నాయి.

ప్రపంచ దేశాల్లో యునైటెడ్ ఫ్రంట్ వర్క్ డిపార్ట్​మెంట్ అక్రమంగా కార్యకలాపాలు నిర్వహించడం, జీ20 దేశాల నుంచి మేధో హక్కులను దొంగలించడం, దక్షిణ చైనా సముద్రాన్ని తనలో కలిపేసుకోవడం వంటి విషయాలపై ప్రజాస్వామ్య దేశాలు గుర్రుగా ఉన్నాయి.

వర్తకానికి 40 శాతానికి పైగా చైనాపైనే ఆధారపడ్డ ఆస్ట్రేలియా సైతం ఆ దేశంతో కఠిన వైఖరి అవలంబిస్తోంది. విదేశీ ఏజెంట్ల చట్టాన్ని ఆమోదించి చైనా ఆధిపత్యాన్ని ఎదుర్కొంది. అయితే అందుకు ప్రతీకారంగా ఆస్ట్రేలియా బార్లీ, బీఫ్ ఎగుమతులపై సుంకాలు విధించింది డ్రాగన్. కొవిడ్​ ఆవిర్భావంపై దర్యాప్తు చేపట్టాలని ఆస్ట్రేలియా డిమాండ్ చేసిన నేపథ్యంలో బెదిరింపులకు దిగింది చైనా. కలప, రాగి, బొగ్గు, వంటి ఉత్పత్తులపైనా సుంకాలు విధిస్తామని హెచ్చరించింది.

బైడెన్ లక్ష్యమదే!

అమెరికా ఎన్నికలు విభజన పూరితంగా మారాయన్న విషయాన్ని ఫలితాలు స్పష్టం చేశాయని గ్లావిన్ పేర్కొన్నారు. అయితే ప్రపంచానికి ముప్పుగా పరిణమించిన చైనా వల్ల అమెరికా ప్రజలు ఒక్కతాటిపైకి వస్తారని అన్నారు.

అమెరికన్లలో ఉండే ప్రాథమిక ఏకాభిప్రాయం ఇప్పుడు ఐరోపా దేశాల్లో బాగా ప్రచారంలోకి వచ్చింది. జిన్​పింగ్​ నేతృత్వంలోని చైనాకు దీటుగా ప్రపంచ ప్రజాస్వామ్య దేశాలన్నీ ఏకతాటిపైకి రావాలని ఐరోపా భావిస్తోంది. ఈ ఏకాభిప్రాయాన్ని తీసుకురావడమే బైడెన్ రూపొందించిన ఒక విదేశాంగ విధానం లక్ష్యం. ట్రంప్ అయిష్టంగానే సంతకం చేసిన హాంకాంగ్ మానవ హక్కులు-ప్రజాస్వామ్య చట్టాన్ని ప్రతిపాదించిన వారిలో కమలా హారిస్ కూడా ఒకరు. కాబట్టి చైనా పట్ల బైడెన్ ప్రభుత్వం కఠినంగానే వ్యవహరించే అవకాశం ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.