ETV Bharat / international

అమెరికా పర్యటనలో  జైశంకర్​ బిజీబిజీ

అమెరికా పర్యటనలో ఉన్న విదేశాంగ మంత్రి జైశంకర్.. వాషింగ్టన్​లోని ఆ దేశ విదేశాంగ మంత్రి సహా పలువురు కీలక నేతలను కలవనున్నారు. అంతకుముందు ఆ దేశ మాజీ జాతీయ భద్రతా సలహాదారు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న జైశంకర్.. పాకిస్థాన్​, అమెరికాలతో ఉన్న సంబంధాలు, భారత్​లో ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై మాట్లాడారు.

jaishankar america, విదేశాంగ మంత్రి జయ్​శంకర్​
అమెరికా పర్యటనలో జయ్​శంకర్
author img

By

Published : May 27, 2021, 1:09 PM IST

అమెరికా పర్యటనలో భాగంగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ స్థానిక కాలమానం ప్రకారం బుధవారం..​ బైడెన్​ యంత్రాంగంలోని పలువురు కీలక నేతలతో చర్చలు జరపాల్సి ఉంది. వాషింగ్టన్​లో మూడు రోజుల పాటు సాగే ఈ పర్యటనలో విదేశాంగ మంత్రి టోనీ బ్లింకెన్, రక్షణ మంత్రి లాయిడ్​ ఆస్టిన్, జాతీయ భద్రతా సలహాదారు జేక్​ సులివాన్​లను ​కలవనున్నట్లు సమాచారం. బైడెన్​ ప్రభుత్వం ఏర్పడిన తొలి 100 రోజుల్లో ఇరు దేశాల మధ్య దౌత్యసంబంధాలు ఏ స్థాయిలో మెరుగయ్యాయి అనే విషయంపై సమీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

అంతకుముందు ఆ దేశ మాజీ జాతీయ భద్రతా సలహాదారు జనరల్​ హెచ్​ఆ మెక్​మాస్టర్​ ఆధ్వర్యంలో హూవర్​ ఇన్​స్టిట్యూషన్​ నిర్వహించిన సమావేశంలో జైశంకర్​ పాల్గొన్నారు. బ్యాటిల్​గ్రౌండ్స్​ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో​.. పాకిస్థాన్​, అమెరికాలతో ఉన్న సంబంధాలు, భారత్​లో ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై మాట్లాడారు.

'ఉగ్రవాదాన్ని సహించం'

భారత్​ ఉగ్రవాదాన్ని సహించదు అని జైశంకర్ స్పష్టం చేశారు. తీవ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశాలతో దౌత్యసంబంధాలకు అంగీకరించమని వెల్లడించారు. ఈ మేరకు పాకిస్థాన్​పై జైశంకర్ పరోక్ష విమర్శలు చేశారు. భారత్​ పాకిస్థాన్​ సైన్యాల​ మధ్య ఇటీవల జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంపై హర్షం వ్యక్తం చేసిన మంత్రి.. ఇరు దేశాల మధ్య మరిన్ని సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు.

వాస్తవం వేరు..

''భారత ప్రభుత్వంపై ప్రపంచానికి తప్పుడు అభిప్రాయం కలిగేలా కొందరు కుట్ర పన్నుతున్నారు. వాస్తవానికి, రాజకీయ నేతలు చేసే దుష్ప్రచారానికి చాలా తేడా ఉంది. మహమ్మారి నేపథ్యంలో 80 కోట్ల మందికి ఉచిత ఆహారం పంపిణీ చేస్తున్నాం. ఇది అమెరికా జనాభాకు రెండింతలు.​ వీటితో పాటు 40 కోట్ల మందికి ఆర్థిక సాయం అందిస్తున్నాం.''

-జైశంకర్, భారత విదేశాంగ మంత్రి

'అజెండా ఉంది'

ప్రపంచ దేశాల్లోని ప్రధాన దౌత్యసంబంధాల్లో భారత్​- అమెరికా బంధం ఒకటని జైశంకర్​ అన్నారు. ఇరు దేశాల బంధం మరింత బలోపేతం చేయడానికి తన వద్ద అజెండా ఉందని వెల్లడించారు. పరిస్థితులు గ్రహించి అందుకు తగ్గట్టుగా మలచుకునే శక్తి అమెరికాకు ఉందన్నారు.

ఇదీ చదవండి : 'గాజా పునర్నిర్మాణానికి అమెరికా సాయం.. కానీ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.