ETV Bharat / international

Johnson&Johnson: 'డెల్టాపై సింగిల్​ డోస్ వ్యాక్సిన్​​ ప్రభావం​ భేష్​'

ప్రపంచాన్ని కలవరపెడుతోన్న డెల్టా వేరియంట్​పై తమ సింగిల్​ డోస్​ టీకా సమర్థవంతంగా పనిచేస్తోందని జాన్సన్​ అండ్​ జాన్సన్​ ప్రకటించింది. డెల్టా వేరియంట్​ వ్యతిరేక యాంటీబాడీలు ఎనిమిది నెలలపాటు రక్షణ కల్పిస్తున్నట్లు తెలిపింది. ఈ మహమ్మారిని అంతమొందించటంలో తమ టీకా కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభవం వ్యక్తం చేసింది.

J&J's single-dose COVID-19 vaccine
జాన్సన్​ అండ్​ జాన్సన్​ వ్యాక్సిన్​
author img

By

Published : Jul 2, 2021, 9:52 AM IST

అమెరికాతో పాటు ఇతర దేశాల్లో వేగంగా వ్యాపిస్తోన్న డెల్టా వేరియంట్​ నుంచి తమ సింగిల్​ డోస్​ టీకా రక్షణ కల్పిస్తోందని జాన్సన్​ అండ్​ జాన్సస్​ సంస్థ ప్రకటించింది. డెల్టా వేరియంట్​తో పాటు సార్స్​-కోవ్​-2 వైరల్​ వేరియంట్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు బలమైన యాంటీబాడీలను ఉత్పత్తి చేసేందుకు దోహదపడుతున్నట్లు తెలిపింది.

అలాగే.. ఈ టీకా ద్వారా ఎనిమిది నెలల పాటు వైరస్​ నుంచి రక్షణ ఉంటుందని పేర్కొంది జాన్సన్​ అండ్​ జాన్సన్​. సింగిల్​ డోస్ టీకాపై ప్రయోగశాలల్లో చేపట్టిన రెండు పరిశోధనలకు సంబంధించిన ఫలితాలను బయోఆర్​షివ్​కు అందించింది.

"జాన్సన్​ అండ్​ జాన్సన్​ వ్యాక్సిన్​ సామర్థ్యాన్ని కొత్తగా ప్రకటించిన అధ్యయనాలు నిరూపించాయి. మా వ్యాక్సిన్​ ఎక్కువకాలం కొవిడ్ నుంచి రక్షణ ఇస్తుందని, డెల్టా వేరియంట్లను అడ్డుకుంటోందని నమ్ముతున్నాం. మా సింగిల్​ డోస్​ వ్యాక్సిన్​ బహుళ వేరియంట్లపై సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు తాజా అధ్యయనం చెబుతోంది."

- పాల్​ స్టోఫెల్స్​, ఎండీ జాన్సన్​ అండ్​ జాన్సన్​.

సింగిల్​ డోస్​ టీకాపై ఎనిమిది నెలలపాటు అధ్యయనం చేపట్టినట్లు తెలిపారు జాన్సన్​​ పరిశోధన అభివృద్ధి సంస్థ ఎండీ మథాయ్​ మమ్మెన్​. బలమైన యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నాయని, సమయం గడిచిన కొద్ది ఆ దిశగా పురోగతి కనిపించినట్లు తెలిపారు. కరోనా మహమ్మారి కట్టడిలో తమ టీకా కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కొవిడ్​కు వ్యతిరేకంగా 85 శాతం సమర్థతతో ఈ టీకా పనిచేస్తుందని వెల్లడించారు. మూడు ఖండాల్లో టీకాపై పరీక్షలు జరిగాయని, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లోనూ వ్యాక్సిన్ మంచి పనితీరు కనబర్చిందని స్పష్టం చేశారు.

జాన్సన్​ అండ్​ జాన్సన్​ వ్యాక్సిన్​ ఇప్పటికే చాలా దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. ఫిబ్రవరి 27న అమెరికాలో అత్యవసర వినియోగానికి అనుమతులు లభించాయి. మార్చ్​ 11న ఐరోపాలో అనుమతులు వచ్చాయి.

ఇదీ చూడండి: వైరస్​ నుంచి రక్షణకు 'సింగిల్​ డోస్' వ్యాక్సిన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.