ETV Bharat / international

'చైనా కుట్రలు తిప్పికొట్టాల్సిన సమయం ఆసన్నం' - US China relation

చైనా వల్లే కరోనా వైరస్​ ప్రపంచానికి పాకిందని మరోసారి విమర్శలు చేశారు అమెరికా విదేశాంగ మంత్రి మైక్​ పాంపియో. ఆసియా, ఐరోపా ఖండాల్లోని దేశాలు షీ జిన్​పింగ్​ పార్టీ నుంచి పొంచి ఉన్న ముప్పును అర్థం చేసుకోవాలని కోరారు. కొవిడ్ మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తుందన్న విషయం చైనాకు ముందే తెలుసని.. కానీ దాన్ని బహిర్గతం చేయలేదని ఆరోపించారు.

It's time to push back against challenge posed by China: Pompeo
'చైనా సవాళ్లను తిప్పికొట్టాల్సిన సమయం ఆసన్నమైంది'
author img

By

Published : Jul 17, 2020, 6:29 PM IST

చైనా విసిరిన సవాళ్లకు దీటుగా సమాధానం ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు అమెరికా విదేశాంగ మంత్రి మైక్​ పాంపియో. చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్​ పార్టీ విధానాల వల్ల అమెరికా సహా అన్నిదేశాలు తీవ్రంగా నష్టపోయాయని ఆయన స్పష్టం చేశారు. వైరస్​ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుందని చైనాకు ముందే తెలుసని.. కానీ ఆ విషయాన్ని బహిర్గతం చేయలేదని ఆరోపించారు. చైనా కమ్యూనిస్టు పార్టీ నుంచి వచ్చే ముప్పును ఎదుర్కొనేందుకు.. దక్షిణాసియాలోని దేశాలే కాకుండా మొత్తం ఆసియా, ఐరోపా దేశాలు కలిసికట్టుగా రావాలని కోరారు.

"ప్రజాస్వామ్య దేశాలు, ప్రపంచవ్యాప్తంగా స్వేచ్ఛను ప్రేమించే ప్రజలు ముందుకొచ్చి చైనా విసిరిన సవాళ్లను తిప్పికొట్టాలి. 40 ఏళ్లుగా అమెరికా అధ్యక్షులు.. చైనాపై ట్రంప్​ తరహాలో కఠిన నిర్ణయాలు తీసుకోలేదు. అమెరికా న్యాయమైన, పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్య సంబంధాలను కలిగి ఉంటుంది. అమెరికా ఇతర దేశాలతో ఎలా వ్యవహరిస్తుందో చైనా కమ్యూనిస్ట్ పార్టీ కూడా అమెరికన్ల పట్ల అలానే ఉండాలి" అని అన్నారు పాంపియో.

డబ్ల్యూహెచ్​ఓ వత్తాసు...

హాంకాంగ్​కు చెందిన వైరాలజిస్ట్​ డాక్టర్​. యాన్​ లి మెంగ్​ ప్రస్తుతం అమెరికాలో తలదాచుకుంటున్నారు. బీజింగ్​కు ముందే వైరస్​ గురించి తెలుసని.. కానీ మూడు వారాల ఆలస్యం వల్ల అందరికీ వ్యాపించిందని ఆమె ఆరోపించారు. ఆ వ్యాఖ్యలపైనా స్పందించారు పాంపియో . ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాకు మద్దతుగా ఉండి ప్రపంచ దేశాలకు సమాచారం ఇవ్వడంలో ఆలస్యం చేసిందని మండిపడ్డారు.

వుహాన్​లో కనుగొన్న వైరస్​ ప్రపంచవ్యాప్తంగా వేల మందిని బలి తీసుకుంది. కోట్ల మందిని బాధితులుగా మార్చుకుంది. ట్రిలియన్​​ డాలర్ల ఆర్థిక నష్టానికి కారణమైంది. కాబట్టి దీనంతటికి చైనా కమ్యూనిస్ట్​ పార్టీ మూల్యం చెల్లించక తప్పదని పాంపియో వ్యాఖ్యానించారు. కరోనా కారణంగా అమెరికాలో 35 లక్షల కేసులు రాగా.. 1,37,000 మంది మరణించారు.

అన్ని మార్గాల్లో చెక్​ పెడతాం..!

"చైనాకు చెందిన వాళ్లు, ఆ దేశంలోని కుటుంబాలు అమెరికాలో అడుగుపెట్టకుండా నిషేధం విధించారా?" అన్న ప్రశ్నను దాటవేశారు పాంపియో. అయితే అధ్యక్షుడు ట్రంప్​ సూచన మేరకు.. వివిధ మార్గాల్లో చైనాను నిలువరించే ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. "వాణిజ్యం, ఆర్థికపరమైన కార్యకలాపాలు, దౌత్యపరంగా మేము డ్రాగన్​కు చెక్​ పెట్టాలని భావిస్తున్నాం" అని పాంపియో అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.