2022లోనూ అమెరికన్లు మాస్కులు ధరించాల్సి రావొచ్చని అమెరికా అధ్యక్ష ప్రధాన వైద్య సలహాదారు, ప్రముఖ అంటువ్యాధుల నిపుణులు ఆంటోనీ ఫౌచీ అభిప్రాయపడ్డారు. ఏడాది కాలంగా కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నారని, ఈ ఏడాది చివరి కల్లా సాధారణ పరిస్థితులు ఏర్పడే అవకాశముందని చెప్పారు.
"కరోనా నుంచి కాపాడుకోవడానికి 2022లో కూడా అమెరికన్లు మాస్కు ధరించాల్సిన అవసరం ఏర్పడవచ్చు. ఈ ఏడాది చివరికల్లా సాధారణ పరిస్థితులు నెలకొన్నా.. ఆ పరిస్థితి తప్పకపోవచ్చు." అని ఫౌచీ అన్నారు.
ఇదీ చూడండి: 'కరోనా తొలగిపోతుందని భావిస్తే పొరబడినట్లే'