ETV Bharat / international

భారత్​, చైనాల మధ్య క్లిష్ట పరిస్థితులు: ట్రంప్​

author img

By

Published : Jun 21, 2020, 5:08 AM IST

భారత్​, చైనా మధ్య సరిహద్దులో నెలకొన్న ప్రతిష్టంభనపై కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. చాలా క్లిష్ట పరిస్థితి నెలకొందని, ఇరు దేశాలకు సాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.

Trump
భారత్​, చైనాల మధ్య క్లిష్ట పరిస్థితులు: ట్రంప్​

సరిహద్దు విషయంలో భారత్​-చైనా మధ్య పెద్ద సమస్య ఏర్పడిందని పేర్కొన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఇరు దేశాలకు సాయం చేసేందుకే ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.

ఓక్లహోమాలోని తుల్సాలో నిర్వహించే ఎన్నికల ర్యాలీకి వెళుతున్న క్రమంలో భారత్​-చైనా పరిస్థితిపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఈ మేరకు స్పందించారు ట్రంప్​.

  • #WATCH It's a very tough situation. We are talking to India, we're talking to China. They have got a big problem there. They have come to blows and we’ll see what happens. We are trying to help them out: US President Donald Trump pic.twitter.com/auaVnDjFdK

    — ANI (@ANI) June 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

" ఇది చాలా క్లిష్ట పరిస్థితి. మేము భారత్​తో మాట్లాడుతున్నాం. చైనాతో మాట్లాడుతున్నాం. సరిహద్దులో వారికి పెద్ద సమస్య తలెత్తింది. వారు ఆపదకు అంచున ఉన్నారు. ఏమి జరుగుతుందో చూద్దాం. వారికి సాయం చేసేందుకే ప్రయత్నిస్తున్నాం."

- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు.

ఈనెల 15 రాత్రి తూర్పు లద్దాఖ్​లోని గల్వాన్​ లోయలో భారత్​-చైనా దేశాల మధ్య ఘర్షణ తలెత్తి 20 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు తీవ్రతరమయ్యాయి. గల్వాన్​ లోయ విషయంలో ఇరుపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.

ఇదీ చూడండి: 'చైనా కమ్యూనిస్ట్​ పార్టీ ఒక 'ధూర్త శక్తి''

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.