ETV Bharat / international

వాషింగ్టన్ గవర్నర్​కు ప్రవాసీల సన్మానం - ఇండో అమెరికన్లు

అమెరికాలో 75వ స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించాలని ప్రవాస భారతీయులు భావిస్తున్నారు. ఈ మేరకు వాషింగ్టన్​ గవర్నర్​ రాబర్ట్ ఇన్​స్లేతో నిర్వహించిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ వేడుకలకు ఇన్​స్లేను ముఖ్య అతిథిగా ఆహ్వానించగా.. ఆయన సానుకూలంగా స్పందించారు.

US INDIA
అమెరికా
author img

By

Published : Oct 30, 2020, 11:10 PM IST

అమెరికా సియాటెల్​లో 2021లో భారత 75వ స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించాలని ప్రవాస భారతీయులు భావించారు. 20 వేల మందితో నిర్వహించే కార్యక్రమానికి వాషింగ్టన్​ గవర్నర్​ జే రాబర్ట్ ఇన్​స్లేను ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని నిర్ణయించారు.

ప్రవాస భారతీయుల ప్రతినిధి టి.జి.విశ్వప్రసాద్ నిర్వహించిన వర్చువల్ ఫండ్ రైజర్​ కార్యక్రమంలో వాషింగ్టన్ గవర్నర్ జే రాబర్ట్ ఇన్​స్లే పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్టికల్ 370 రద్దు నిర్ణయంపై మాట్లాడిన ఇన్​స్లే.. ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం వ్యర్థమని పేర్కొన్నారు. తమ పరిధిలో ఉన్న సమాజానికి సేవలందించటంపై దృష్టి సారించాలని వ్యాఖ్యానించారు. ప్రతి దేశానికి సొంత సమస్యలు ఉంటాయని, వాటిపై అంతర్గతంగా దృష్టి సారించాలని సూచించారు.

ఇన్​స్లేకు ప్రశంసలు..

ఈ సమావేశంలో ఇన్​స్లేపై ప్రవాస భారతీయులు ప్రశంసలు కురిపించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నిర్మాణంతోపాటు రాష్ట్ర సాంస్కృతిక గుర్తింపును సుసంపన్నం చేయడంలో గవర్నర్ కీలక పాత్ర పోషించారని అన్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రభుత్వం ఎంతో సమర్థంగా పనిచేశామని ఇన్​స్లే వివరించారు.

రాష్ట్రంలో భారత్​కు చెందిన ఒక ప్రతినిధి బృందాన్ని 2021లో ఏర్పాటు చేయాలని ఇన్​స్లేను విశ్వప్రసాద్​ కోరారు. ఈ విషయంలో సానుకూలంగా స్పందించిన ఇన్​స్లే.. విశ్వప్రసాద్ ప్రతిపాదనకు మద్దతు తెలిపారు.

ఇదీ చూడండి: మెలానియా VS జిల్‌.. గెలిచేదెవరో పజిల్‌!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.