ఎవరైనా ఉద్యోగం ఎన్నేళ్లు చేయగలరు? మహా అయితే 20-30 ఏళ్లు. కానీ... అమెరికా ఇండియానా రాష్ట్రం క్లింటన్‌కు చెందిన బాబ్ వోల్మర్ మాత్రం 6 దశాబ్దాలుకుపైగా పనిచేశారు. 102 ఏళ్ల వయస్సులో గురువారం ఉద్యోగ విరమణ చేశారు.
-
Bob Vollmer, our oldest state employee at 102 years old, has been providing #GreatGovernmentService at the @INdnrnews for decades. I was honored to present him with a Sagamore in 2016 and wish him the absolute best in his retirement! https://t.co/nozxY7T3RM pic.twitter.com/Dk7OSjGf11
— Eric Holcomb (@GovHolcomb) January 15, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Bob Vollmer, our oldest state employee at 102 years old, has been providing #GreatGovernmentService at the @INdnrnews for decades. I was honored to present him with a Sagamore in 2016 and wish him the absolute best in his retirement! https://t.co/nozxY7T3RM pic.twitter.com/Dk7OSjGf11
— Eric Holcomb (@GovHolcomb) January 15, 2020Bob Vollmer, our oldest state employee at 102 years old, has been providing #GreatGovernmentService at the @INdnrnews for decades. I was honored to present him with a Sagamore in 2016 and wish him the absolute best in his retirement! https://t.co/nozxY7T3RM pic.twitter.com/Dk7OSjGf11
— Eric Holcomb (@GovHolcomb) January 15, 2020
బాబ్ వోల్మర్... 2వ ప్రపంచ యుద్ధంలో పోరాడిన సైనికుడు. 1962లో ఇండియానా రాష్ట్ర సహజ వనరుల విభాగంలో సర్వేయర్‌గా చేరారు. ఆ శాఖ పరిధిలోని ప్రాజెక్టులకు సంబంధించిన సాంకేతిక డేటా సేకరించడం, సరిహద్దులు నిర్ణయించడం ఆయన విధి. గురువారం చివరిసారిగా ఓ ప్రాజెక్టుకు సర్వే చేశారు. శరీరం ఇక సహకరించదని గుర్తించే పదవీ విరమణ చేస్తున్నట్లు చెప్పారు బాబ్.
"పదవీ విరమణ చేయడం నాకు అసలు ఇష్టం లేదు. కానీ ఏదో ఒక రోజు నిష్క్రమించక తప్పుదు. నేను ఈ పనిని చేయలేను అనుకున్నంత వరకు నా పనిని నేను బాధ్యతతో నిర్వర్తించాను. పదవి విరమణ సమయం వచ్చినప్పుడు మనకు మనమే నిష్క్రమించటం మంచిది."
-బాబ్ వోల్మర్
ఇకపై పుస్తక పఠనం, వ్యవసాయం చేస్తూ గడుపుతానని చెప్పారు బాబ్.
ఇదీ చూడండి: మోదీ-రాజపక్సే సరికొత్త స్నేహగీతం