ETV Bharat / international

'అమెరికా విధానాలతో కెనడాకు భారత యువత' - భారతీయ అమెరికన్ల వార్తలు

కాలం చెల్లిన వీసా విధానాల వల్ల ప్రతిభావంతులైన భారతీయ యువత అమెరికాను కాదని.. కెనడావైపు తరలిపోతోందని అగ్రరాజ్య కాంగ్రెస్​ను హెచ్చరించారు నిపుణులు​. భారతీయ ప్రతిభ అమెరికా నుంచి కెనడా వైపు తరలిపోకుండా చర్యలు తీసుకోవాలని చట్టసభ్యులను కోరారు.

us visa policy h1b canada, అమెరికా వీసా విధానం
'అమెరికాను వదలి కెనడా బాటపడుతున్నారు'
author img

By

Published : Jul 15, 2021, 9:51 AM IST

ప్రతిభావంతులైన భారతీయ యువత అమెరికాను కాదని.. కెనడావైపు తరలిపోతోందని ఇమ్మిగ్రేషన్ అండ్ పాలసీ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. హెచ్​1బీ వీసా విధానంపై అగ్రరాజ్యం అనుసరిస్తున్న తీరే అందుకు కారణమని చట్టసభ్యులకు తెలిపారు. ఉపాధి ఆధారిత గ్రీన్​ కార్డులు, శాశ్వత నివాస హోదా జారీకి దేశాల వారీగా కేటాయింపులు చేయడం.. భారతీయ యువత కెనడాకు తరలివెళ్లడానికి దారితీస్తోందన్నారు.

మూడు ఉద్యోగ ఆధారిత విభాగాల బ్యాక్‌లాగుల్లో భారతీయుల వాటా ప్రస్తుతం 9.15 లక్షలుగా ఉందన్న అధికారులు.. ఈ సంఖ్య 2030 నాటికి 21.95 లక్షలకు చేరుతుందని అంచనావేశారు. సుమారు 20 లక్షల మంది దశాబ్దం పాటు ఉపాధి ఆధారిత గ్రీన్‌కార్డు కోసం వేచిచూడాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు వలసలు, పౌరసత్వానికి సంబంధించి హౌస్ జ్యుడిషియరీ కమిటీ ముందు అధికారులు తమ వాదనలు వినిపించారు. భారతీయ ప్రతిభ అమెరికా నుంచి కెనడా వైపు తరలిపోకుండా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ను కోరారు.

ఇదీ చదవండి : George W.Bush: బలగాల ఉపసంహరణ తప్పిదమే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.