ETV Bharat / international

అమెరికా చదువుకు భారత్​లో మహా క్రేజ్​ - Indian sent over 202k students to US in 2018-19, second largest after China: Report

అమెరికాలో విద్యనభ్యసిస్తున్న విదేశీ విద్యార్థులకు సంబంధించి నివేదిక విడుదల చేసింది అక్కడి విద్యాశాఖ. అత్యధికంగా చైనా విద్యార్థులు అమెరికాకు వస్తుండగా... తర్వాతి స్థానంలో భారత్​ నిలిచింది. 2018-19 సంవత్సరంలో 2,02,014 మంది భారతీయ విద్యార్థులు అమెరికా వచ్చినట్లు నివేదిక స్పష్టం చేసింది.

అమెరికా చదువుకు భారత్​లో మహా క్రేజ్​
author img

By

Published : Nov 18, 2019, 1:22 PM IST

అమెరికాలో విద్యనభ్యసిస్తున్న విదేశీ విద్యార్థులలో భారతీయులు రెండో స్థానంలో ఉన్నట్లు ఆ దేశ ప్రభుత్వ నివేదిక స్పష్టం చేసింది. '2019 ఓపెన్​ డోర్స్ రిపోర్ట్ ఆన్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఎక్స్చేంజ్' పేరిట ఈ నివేదిక విడుదల చేసింది అమెరికా ప్రభుత్వం. ఉన్నత విద్యనభ్యసించడానికి అమెరికా వస్తున్నవారిలో చైనా తర్వాత అత్యధికంగా భారత్​ నుంచే ఉన్నట్లు స్పష్టమైంది. 2018-19లో 2,02,014 మంది భారతీయ విద్యార్థులు అమెరికాకు వచ్చినట్లు వెల్లడైంది. అమెరికాకు వస్తున్న విదేశీ విద్యార్థుల సంఖ్య 2018-19లో ఎన్నడూ లేనంత స్థాయికి(10,95,299) చేరుకుందని నివేదిక స్పష్టం చేసింది. పది లక్షలకు మించి విద్యార్థులు అమెరికాకు రావడం ఇది వరుసగా నాలుగో సంవత్సరమని తెలిపింది.

ఆర్థిక వ్యవస్థకు ఊతం

విదేశీ విద్యార్థులు అమెరికా ఆర్థిక రంగానికి పెద్ద ఎత్తున సహకరిస్తున్నట్లు అమెరికా వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. విదేశీ విద్యార్థులు 2018లో అమెరికా జీడీపీకి 44.7 బిలియన్​ డాలర్లు అందించినట్లు తెలిపింది. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 5.5 శాతం ఎక్కువ అని లెక్కగట్టింది.

చైనీయులే అధికం

వరుసగా పదో ఏడాదిలోనూ చైనా నుంచే అత్యధికంగా విద్యార్థులు అమెరికా వచ్చినట్లు తేలింది. మొత్తం 10,95,299 విదేశీ విద్యార్థుల్లో 3,69,548 మంది చైనీయులే ఉన్నారు. 50 శాతానికి పైగా భారత్​, చైనా విద్యార్థులే ఉండటం గమనార్హం. భారత్​(2,02,014) తర్వాత దక్షిణ కొరియా(52,250), సౌదీ అరేబియా(37,080), కెనడా(26,122) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

అమెరికాకు వస్తున్న విదేశీ విద్యార్థుల సంఖ్య పెరగడం చాలా సంతోషం కలిగిస్తోంది. అమెరికా విద్యార్థులు సైతం ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్తున్నారు. దేశానికి వస్తున్న విదేశీ విద్యార్థుల సంఖ్యను పెంచడమే విద్య, సాంస్కృతిక వ్యవహారాల శాఖ ప్రధాన లక్ష్యం. అమెరికాను ఉన్నత విద్యకు అత్యుత్తమ ప్రదేశంగా తీర్చిదిద్ది మరింత మందిని అమెరికాకు రప్పించడానికి కృషి చేస్తున్నాం.
-మేరీ రాయిస్, విద్య-సాంస్కృతిక వ్యవహారాల సహాయ కార్యదర్శి

అమెరికా విద్యార్థులు సైతం

అమెరికా విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాల బాట పట్టారు. 2017-18 విద్యా సంవత్సరంలో 3,41,751 మంది విద్యార్థులు విదేశీ విద్యకోసం పయనమయ్యారు. అంతకుముందు సంవత్సరంతో పోల్చితే ఈ సంఖ్య 2.7శాతం ఎక్కువ. అమెరికా విద్యార్థులు విదేశీ విద్య కోసం ఎక్కువగా ఐరోపా దేశాలను ఎంచుకుంటున్నారు. యూకే, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ తదితర దేశాలవైపు వీరు మొగ్గుచూపుతున్నారు.

Intro:जेएनयूBody:JnuConclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.