ఐక్యరాజ్యసమితిలో భారత్ మరో విజయం సాధించింది. ఐరాస పాలన, బడ్జెట్ సలహా కమిటీ(ఏసీఏబీక్యూ)కి భారత దౌత్యవేత్త విదిశా మైత్రా ఎన్నికయ్యారు. ఈ కమిటీ ఐరాస జనరల్ అసెంబ్లీకి అనుబంధంగా పనిచేస్తుంది. విస్తృత భౌగోళిక ప్రాతినిధ్యం, వ్యక్తిగత అర్హత, అనుభవం ఆధారంగా సలహా కమిటీ సభ్యులను ఎంపిక చేస్తారు.
-
India’s candidate Ms Vidisha Maitra elected to UN body - ACABQ, with strong support of @UN Member States.
— India at UN, NY (@IndiaUNNewYork) November 6, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Watch video message of PR to UN Ambassador T. S. Tirumurti @ambtstirumurti ⤵️ pic.twitter.com/aIgFHbmIkJ
">India’s candidate Ms Vidisha Maitra elected to UN body - ACABQ, with strong support of @UN Member States.
— India at UN, NY (@IndiaUNNewYork) November 6, 2020
Watch video message of PR to UN Ambassador T. S. Tirumurti @ambtstirumurti ⤵️ pic.twitter.com/aIgFHbmIkJIndia’s candidate Ms Vidisha Maitra elected to UN body - ACABQ, with strong support of @UN Member States.
— India at UN, NY (@IndiaUNNewYork) November 6, 2020
Watch video message of PR to UN Ambassador T. S. Tirumurti @ambtstirumurti ⤵️ pic.twitter.com/aIgFHbmIkJ
2021 జనవరి 1 నుంచి మైత్రా పదవీకాలం ప్రారంభమవుతుంది. మూడేళ్లు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. 2021 జనవరి నుంచి రెండేళ్ల కాలానికి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా కొనసాగనున్న నేపథ్యంలో ఈ విజయం వరించటం విశేషం.
ఆసియా-పసిఫిక్ దేశాల నుంచి ఇద్దరు నామినేట్ కాగా మైత్రా విజయం సాధించారు. 126 ఓట్లు సాధించిన ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధిగా మైత్రా నిలిచారు. ఇరాక్ దౌత్యవేత్త అలీ మహ్మద్ 64 ఓట్లతో సరిపెట్టుకున్నారు.
ఇదీ చూడండి: ఐరాస కీలక కమిటీ ఎన్నికల్లో చైనాపై భారత్ విజయం