ETV Bharat / international

'అమెరికా అభివృద్ధిలో భారతీయులదే కీలక పాత్ర' - జో బైడెన్​ తాజా వార్తలు

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే భారతీయ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్​ హామీ ఇచ్చారు. అమెరికా అభివృద్ధికి భారతీయ సమాజం కీలక పాత్ర పోషించిందని కొనియాడారు. దేశ సంస్కృతిలో భాగమయ్యారని పేర్కొన్నారు.

US INDIANS BIDEN
జో బైడెన్
author img

By

Published : Sep 23, 2020, 9:31 AM IST

అమెరికా ఆర్థిక వృద్ధికి భారతీయ అమెరికన్లు ఎంతో కృషి చేశారని డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్​ ప్రశంసించారు. దేశంలో సాంస్కృతిక చైతన్యంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.

వాషింగ్టన్​లో భారతీయ అమెరికన్లు నిర్వహించిన జాతీయ నిధుల సేకరణ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు బైడెన్.

"దేశంలో భారతీయ అమెరికన్లు ఎన్నో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. కొంతమంది సిలికాన్​ వ్యాలీ కోసం కృషి చేశారు. మరికొంతమంది పెద్ద కంపెనీలకు నేతృత్వం వహిస్తున్నారు. ఇది కొనసాగుతుంది. మనది వలసవాద దేశం. భారతీయ సమాజం ఎదుర్కొంటున్న హెచ్​1బీ వీసా, చట్టబద్ధమైన వలసదారులకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తాం."

- జో బైడెన్, అమెరికా అధ్యక్ష అభ్యర్థి

ఇదే వేదికగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​పై బైడెన్​ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. హెచ్​1బీ, జాత్యాహంకారం, వాతావరణ సంక్షోభంపై ట్రంప్ ప్రమాదకరంగా వ్యవహరించారని ఆరోపించారు. ఆయన పరిస్థితిని మరింత దిగజార్చారని మండిపడ్డారు.

హిందూ పసిఫిక్ ప్రాంతంపై..

భారత్​, అమెరికాలు హిందూ పసిఫిక్ ప్రాంతంలో నిబంధనల అమలుకు బలమైన ఆసక్తి చూపిస్తున్నాయని బైడెన్​ తెలిపారు. ఫలితంగా చైనా సహా మరే ఇతర దేశం తమ పొరుగు దేశాలపై బెదిరింపు చర్యలకు పాల్పడకుండా నియంత్రించగలమని అభిప్రాయపడ్డారు. అయితే, చైనా అణచివేత చర్యలకు ట్రంప్ అవకాశమిస్తున్నారని ఆరోపించారు.

ఇదీ చూడండి: 'కరోనాను ఎదుర్కొనేందుకు ట్రంప్​ భయపడ్డారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.