ETV Bharat / international

బైడెన్ 'కొవిడ్ టాస్క్​ఫోర్స్'​లో భారతీయ అమెరికన్! - డాక్టర్​ వివేక్ మూర్తి ఎవరు

అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్​.. కరోనాను కట్టడి చేసి అమెరికాకు పూర్వ వైభవం తీసుకురావడమే తమ ప్రభుత్వ మొదటి లక్ష్యమన్నారు. ఇందుకోసం ఓ ప్రత్యేక కార్యదళాన్ని కూడా ప్రకటించనున్నట్లు తెలిపారు. ఈ టాస్క్​ ఫోర్స్​లో భారతీయ అమెరికన్ డాక్టర్ వివేక్​ మూర్తికి కీలక స్థానం కల్పించొచ్చని తెలుస్తోంది.

Vivek Murty May led US c
అమెరికా కొవిడ్ టాస్క్​ ఫోర్స్​లో భారతీయ అమెరికన్
author img

By

Published : Nov 8, 2020, 11:18 AM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్.. తొలి యుద్ధం కొవిడ్​ పైనేనని స్పష్టం చేశారు. కరోనా వైరస్ కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటామని విజయోత్సవ ప్రసంగంలో తెలిపారు. ఇందుకోసం సోమవారం ప్రత్యేక టాస్క్​ఫోర్స్​ను​ ప్రకటించనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రత్యేక టాస్క్​ఫోర్స్​కు ఉపాధ్యక్షుడిగా భారతీయ అమెరికన్​ ఫిజీషియన్ డాక్టర్ వివేక్​ మూర్తిని నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కర్ణాటకకు చెందిన వివేక్​ మూర్తి (43)ని 2014లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా.. అమెరికా 19వ సర్జన్​ జనరల్​గా నియమించారు. బ్రిటన్​లో జన్మించిన వివేక్​ మూర్తి 37 ఏళ్ల వయస్సులోనే ఆ బాధ్యతలను చేపట్టారు. ట్రంప్ పాలనా సమయంలో వివేక్ మూర్తి ఆ స్థానం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

ఎన్నికల్లో గెలిచిన తర్వాత విజయోత్సవ ప్రసంగంలో జో బైడెన్​.. కరోనాను కట్టడి చేసే శాస్త్రవేత్తలు, సలహాదారుల బృందాన్ని సోమవారం ప్రకటించనున్నట్లు తెలిపారు. అయితే ఈ బృందానికి సారథిగా ఎవిరిని నియమిస్తారనేది మాత్రం వెల్లడించలేదు.

అయితే ప్రముఖ వార్తా పత్రిక వాషిగ్టన్​ పోస్ట్.. ఈ టాస్క్ ఫోర్స్​కు వివేక్​ మూర్తి సహా మాజీ ఫుడ్ అండ్ డ్రగ్​ అడ్మినిస్ట్రేషన్​ కమిషనర్​ డేవిడ్ కెస్లేర్​లు ఉపాధ్యక్షులుగా నియమితులయ్యే అవకాశముందని ప్రచురించింది.

ఇదీ చూడండి:'ట్రంప్​తో శత్రుత్వం లేదు.. అందరితో కలసి పనిచేస్తాం'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.