ETV Bharat / international

ట్రంప్​ అభిశంసనకు ఇండోఅమెరికన్​ సభ్యుల మద్దతు! - అమెరికా మాజీ అధ్యక్షుడు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​పై అభిశంసనకు మద్దతుగా ఓటు వేశారు పలువురు భారతీయ అమెరికన్​ చట్టసభ్యులు. తన మద్దతుదారులను ట్రంప్​ ప్రేరేపించటం వల్లే క్యాపిటల్ భవనం, ప్రజాస్వామ్య సంస్థలపై దాడి జరిగిందన్నారు. ట్రంప్​ను దోషిగా తేల్చాల్సిందేనని పేర్కొన్నారు.

impeachment of Trump
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్
author img

By

Published : Feb 11, 2021, 1:16 PM IST

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ తనపై వచ్చిన రెండో అభిశంసన నుంచి గట్టెక్కేలా కనిపించటం లేదు. ఇప్పటికే సెనేట్​లో అభిశంసన ప్రక్రియ​ ప్రారంభమైంది. ఈ క్రమంలో అభిశంసనకు పలువురు భారతీయ అమెరికన్​ చట్టసభ్యులు మద్దతు పలికారు. జనవరి 6న హింస చెలరేగేలా తన మద్దతుదారులను ట్రంప్​ ప్రేరేపించటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

" ట్రంప్​ తన మద్దతుదారులను ప్రేరేపించటం వల్లే గత నెలలో మన క్యాపిటల్ భవనం, ప్రజాస్వామ్య సంస్థలపై దాడి జరిగింది. ఆ రోజు అమెరికా ప్రతినిధులు, సెనేటర్లు, సిబ్బంది తమ ప్రాణాలు రక్షించుకునేందుకు పరుగులు తీశారు. ఆయనను దోషిగా తేల్చాల్సిన అవసరాన్ని అది స్పష్టం చేస్తోంది. సెనేట్​లో మాజీ అధ్యక్షుడి అభిశంసన విచారణ​ సమయంలో.. జనవరి 6న జరిగిన హింసాత్మక ఘటనలు గుర్తుకొచ్చాయి. క్యాపిటల్​పై దుండగులు దాడికి పాల్పడినప్పుడు.. నా సిబ్బందితో పాటు మా కార్యాలయం నుంచి బయటకు పరుగులు తీశాం. మా కార్యాలయం కిటికీకి 200 అడుగుల దూరంలోనే బాంబును కనుగొన్నారు. ​"

- రాజా కృష్ణమూర్తి, భారతీయ అమెరికన్​ కాంగ్రెస్ సభ్యుడు​

అమెరికా ప్రతినిధుల సభలో ట్రంప్​ అభిశంసనకు అనుకూలంగా ఓటు వేశారు కృష్ణమూర్తి. ఆయన దారిలోనే మరో ముగ్గురు భారతీయ అమెరికన్​ చట్టసభ్యులు అమి బెరా, రో ఖన్నా, ప్రమీళా జయపాల్​ నడిచారు.

ఇదీ చూడండి: 'అభిశంసన'లో ట్విస్ట్- ట్రంప్​కు సొంత​ లాయర్​ షాక్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.