ETV Bharat / international

అమెరికా సైన్స్​ బోర్డు సభ్యుడిగా భారత సంతతి వ్యక్తి - AMERICA INDIA LATEST NEWS

అమెరికాలో భారత సంతతికి చెందిన వ్యక్తికి అరుదైన గౌరవం లభించింది. అగ్రరాజ్య సైన్స్ బోర్డు సభ్యుడిగా సుదర్శనమ్​ బాబును నియమించారు అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​.

Indian-American appointed to US science board
అమెరికా సైన్స్​ బోర్డు సభ్యుడిగా భారత సంతతి వ్యక్తి
author img

By

Published : Apr 21, 2020, 1:13 PM IST

అమెరికా అత్యున్నత సైన్స్​ బోర్డు మెంబరుగా భారత సంతతికి చెందిన వ్యక్తిని నియమించారు అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. ప్రతిష్ఠాత్మక ఓక్​ రిడ్జ్​ నేషనల్​ ల్యాబొరేటరీ (ఓఆర్​ఎన్​ఎల్​)కి చెందిన సుదర్శన్​ బాబు ఆరేళ్ల పాటు సైన్స్​ బోర్డ్​ సభ్యుడిగా వ్యవహరిస్తారని శ్వేతసౌధం​ తెలిపింది.

బాబు 1998లో ఐఐటీ- మద్రాస్​ నుంచి మాస్టర్​ ఆఫ్ టెక్నాలజీ ( ఇండస్ట్రియల్​ మెటలర్జీ- వెల్డింగ్​) పూర్తి చేశారు. 1986లో కోయంబత్తూరులోని పీఎన్జీ కాలేజ్​ ఆఫ్​ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్​ పట్టా పొందారు.

కేంబ్రిడ్జ్​ విశ్వవిద్యాలయం నుంచి మెటీరియల్​ సైన్స్​, మెటలర్జీ సబ్జెక్టుల్లో పీహెచ్​డీ చేశారు. ప్రస్తుతం బ్రెడెసన్​ సెంటర్​ ఫర్​ ఇంటర్​ డిసిప్లినరీ రీసెర్చ్​ గ్యాడ్యుయేట్​ ఎడ్యుకేషన్​ డైరెక్టర్​గా, ఓఆర్​ఎన్​ఎల్​ గవర్నర్​ చైర్​ ఆఫ్​ అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్​లోనూ పని చేస్తున్నారు సుదర్శనమ్​.

బాబుతో కలిపి మొత్తం ఇప్పటివరకు ముగ్గురు భారత సంతతి వ్యక్తులకు సైన్స్​ బోర్డులో పనిచేసే అవకాశం దక్కింది. గతంలో సేతురామన్​ పంచనాథన్​, సురేష్​ వి గారిమెల్ల ఈ విధులను నిర్వర్తించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.