వాణిజ్య సత్సంబంధాలు మెరుగుపరుచుకునే దిశగా భారత్-అమెరికా కీలక నిర్ణయాలు తీసుకున్నాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బృందం పేర్కొంది. ద్వైపాక్షిక వాణిజ్య సమస్యలపై ఇరు దేశాలు కలిసి కట్టుగా కృషి చేయనున్నట్లు వెల్లడించింది.
ఈ మేరకు.. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడుల గురించి భారత వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్‌తో షోన్లో మాట్లాడారు అమెరికా వాణిజ్య రాయబారి క్యాథరీన్ తాయ్. 2021లో ట్రేడ్ పాలసీ ఫోరమ్‌కు సంబంధించి ఇరు దేశాల మంత్రులు సమావేశం కానున్నట్లు తెలిపారు.