అమెరికా- భారత్ మధ్య ఇరు దేశాల భద్రతకు సంబంధించిన చర్చలు తిరిగి ప్రారంభమవుతాయని బైడెన్ ప్రభుత్వం తెలిపింది. యూఎస్ హోం మంత్రి అలెజాన్డ్రో మాయోర్కాస్.. భారత రాయబారి తరణ్జిత్ సింగ్ సంధుతో సోమవారం భేటీ అయిన అనంతరం ఈ విషయం వెల్లడించింది. ట్రంప్ హయాంలో ఇరు దేశాల భద్రతకు సంబంధించిన సమావేశాలు నిలిచిపోయాయి.
సైబర్ భద్రత, నూతన సాంకేతికత, ఉగ్రవాదం హెచ్చరిల్లడం వంటి కీలకాంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు అలెజాన్ తెలిపారు.
ఇరువురి మధ్య జరిగిన భేటీలో ఇటీవల జరిగిన క్వాడ్ సమావేశంలోని అంశాలు చర్చకు వచ్చాయి. ముఖ్యంగా కరోనా కట్టడికి క్వాడ్ దేశాలు కలిసికట్టుగా పని చేయాలన్న తీర్మానం, వాతావరణ పరిస్థితులు, సైబర్ భద్రత అంశాలు చర్చకు వచ్చాయి.
ఇదీ చదవండి: బైడెన్ సర్కార్కు 'వలస' తలనొప్పులు