ETV Bharat / international

మేధోసంపత్తి సూచీలో భారత్​కు 40వ ర్యాంకు

అంతర్జాతీయ మేధోసంపత్తి సూచీలో భారత్​ 40వ ర్యాంకు సాధించింది. అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ గ్లోబల్​ ఇన్నోవేషన్ పాలిసీ సెంటర్(జీఐపీసీ) ఈ ర్యాంకులను విడుదల చేసింది. గత కొన్ని సంవత్సరాలుగా భారత్ వాస్తవిక వృద్ధిని కనబరుస్తోందని పేర్కొంది.

author img

By

Published : Mar 24, 2021, 7:00 AM IST

India ranks 40th on International Intellectual Property Index
మేధోసంపత్తి సూచీలో భారత్​కు 40వ ర్యాంకు

అంతర్జాతీయ మేధోసంపత్తి సూచీ(ఐపీ)లో భారత్ 40వ ర్యాంకు సాధించింది. ఈమేరకు అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ గ్లోబల్ ఇన్నోవేషన్ పాలిసీ సెంటర్(జీఐపీసీ) 2020కి సంబంధించి వార్షిక ర్యాంకులను మంగళవారం విడుదల చేసింది. 53 ప్రపంచ ఆర్థిక రంగాల మేధో సంపత్తి హక్కులను జీఐపీసీ మదింపు చేసింది. ఇందులో భాగంగా పేటెంట్, కాపీరైట్, విధానాల నుంచి మేధోసంపత్తి వ్యాపారీకరణ, అంతర్జాతీయ ఒప్పందాల ధ్రువీకరణ వరకు వివిధ అంశాలను మదింపు చేసింది.

ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ ఐపీ 2020లో మెరుగు పడినట్లు జీఐపీసీ సూచి వెల్లడించింది. ర్యాంకులకు సంబంధించిన 8వ సంచికలో మొత్తం 50 మేధోసంపత్తి అంశాలపై భారత్ 38.46 శాతం స్కోరు సాధించినట్లు జీఐపీసీ నివేదికలో తెలిపింది. ఏడో సంచిక(36.04 శాతం) కంటే భారత్ స్కోరు పెరిగినట్లు వెల్లడించింది. గత కొద్ది సంవత్సరాలుగా భారత్ వాస్తవిక వృద్ధిని కనబరుస్తోందని పేర్కొంది.

"ప్రపంచంలో ఉత్తమ నవకల్పనలు, సృజనాత్మక ఆర్థిక రంగాల్లో ఒకటైన భారత్​లో ఏకీకృత మేధోసంపత్తి(ఏపీ) విధానం ఆ దేశ పోటీతత్వానికి ఊతమిస్తోంది. ముఖ్యంగా భారత్​లో అడ్వాన్స్​డ్ మ్యానుఫాక్చరింగ్, బయోఫార్మాస్యుటికల్ ఉత్పత్తులు, సృజనాత్మక అంశాలు సహా అనేక కీలక రంగాలకు సంబంధించి ఇది వాస్తవం." అని అమెరికాలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్​లో జీఐపీసీ సీనియర్ వైస్ ప్రెసిండ్ పాట్రిక్ కిల్​బ్రైడ్ తెలిపారు. యూఎస్ ఛాంబర్ సూచీకి సంబంధించి బ్రిక్స్ దేశాల్లో భారత్ రెండో అత్యధిక వృద్ధిని నమోదు చేసినట్లు చెప్పారు.

ఇదీ చదవండి:రైల్లో సిగరెట్ తాగితే మూడేళ్ల జైలు.. రూ.1000 జరిమానా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.