ETV Bharat / international

ప్రపంచంపై కరోనా పంజా.. 2 లక్షలకు చేరువలో మృతులు - కోవిడ్ -19 తాజా వార్తలు

ప్రపంచవ్యాప్తంగా కరోనా విధ్వంసకరం సృష్టిస్తోంది. మృతుల సంఖ్య 2 లక్షలకు చేరువ కాగా... కేసుల సంఖ్య 28 లక్షలు దాటింది. అటు.. అగ్రరాజ్యంలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. 52 వేల మందికిపైగా వైరస్​ ధాటికి బలయ్యారు. 24 గంటల వ్యవధిలో 3,176 మంది మృతి చెందగా... మొత్తం 9 లక్షల మందికి వైరస్​ సోకింది. మరోవైపు స్పెయిన్​లో కరోనా తగ్గుముఖం పడుతోంది.

corona
కరోనా
author img

By

Published : Apr 25, 2020, 5:21 AM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా విధ్వంసం కొనసాగుతోంది. మానవాళిపై వైరస్ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య కొత్త శిఖరాలకు చేరుతోంది. గత 24 గంటల్లోనే కొత్తగా 81,390 మందికి కరోనా సోకింది. మరో 4,675 మందిని వైరస్ కబలించింది. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,96,956కి చేరింది. కేసుల సంఖ్య 28 లక్షలు దాటగా... 7,80,085 మంది వైరస్ బారి నుంచి సురక్షితంగా బయటపడ్డారు.

coronavirus
ప్రపంచవ్యాప్తంగా కరోనా వివరాలు

అగ్రరాజ్యంలో 52 వేల మరణాలు

అమెరికాను కరోనా కబలిస్తోంది. అగ్రరాజ్యంలో అంతకంతకూ పెరుగుతున్న కరోనా ఉద్ధృతితో ఇప్పటివరకు 52 వేలకుపైగా మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం బాధితుల సంఖ్య 9 లక్షలు దాటిపోయింది. 24 గంటల వ్యవధిలో 3,176 మంది ప్రాణాలు విడిచారు. దీంతో ఇప్పటివరకు అమెరికాలో మృతి చెందిన వారి సంఖ్య 52,087కి చేరింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేసుల్లో మూడింట ఒక వంతు కేసులు అమెరికాలోనే నమోదవుతున్నాయి.

ఓ వైపు దేశంలో కరోనా కేసులు, మరణాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నప్పటికీ అమెరికాలోని పలు రాష్ట్రాలు లాక్​డౌన్ ఆంక్షలను సడలిస్తున్నాయి. నిపుణుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ.. హెయిర్ సెలూన్లు, స్పాలకు ఆంక్షలనుంచి మినహాయిస్తున్నట్లు జార్జియా, ఓక్లహోమా ప్రభుత్వాలు ప్రకటించాయి. అయితే భౌతిక దూరం సహా పలు జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచించాయి.

బ్రిటన్​

బ్రిటన్​లో వైరస్ మరణాలు 20 వేలకు చేరువయ్యాయి. గత 24 గంటల వ్యవధిలో 684 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఆస్పత్రిలో మరణాల సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో బ్రిటన్​లో కరోనా నియంత్రణ అవుతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయని యూకే రవాణా సెక్రెటరీ గ్రాంట్ షాప్స్ పేర్కొన్నారు. ప్రజలంతా ఇళ్లలో ఉండి, భౌతిక దూరం పాటించడం వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. అయితే సంక్షోభం ముగిసిపోలేదని, కేసులు మరింత తగ్గుముఖం పట్టాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

కరోనా ప్రభావంతో దెబ్బతిన్న వాణిజ్యం, రవాణా రంగాలను ఆదుకునేందుకు ఆర్థిక ప్యాకేజీలు ప్రకటించారు గ్రాంట్ షాప్స్. సంక్షోభం సమయంలోనూ అత్యవసర సరుకుల రవాణా కొనసాగేలా ఫ్రాన్స్, ఐర్లాండ్​లతో త్రైపాక్షిక ఒప్పందానికి కసరత్తులు చేస్తున్నట్లు తెలిపారు.

స్పెయిన్​లో శాంతి!

స్పెయిన్​లో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. శుక్రవారం కేవలం 367 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. గత నెల రోజుల రోజూవారీ మరణాల సంఖ్యలో ఇదే అత్యల్పం. కొత్తగా 6,740 మందికి వైరస్ సోకగా.. మొత్తం కేసులు 2,19,764కి చేరాయి. మరణాల సంఖ్య 22,524గా ఉంది.

సింగపూర్​లో​ 12 వేలు దాటిన కేసులు

సింగపూర్​లో మరో 897 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆ దేశ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇందులో 853 మంది వసతి గృహాల్లో ఉంటున్న విదేశీ కార్మికులేనని స్పష్టం చేసింది. దీంతో సింగపూర్​లో కరోనా కేసుల సంఖ్య 12 వేలు దాటింది.

ఇదీ చదవండి: కానిస్టేబుల్ కిడ్నాప్​.. ఇద్దరు ముష్కరులు హతం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.