అమెరికా రక్షణ వ్యవస్థ పెంటగాన్‌లో కీలక పదవికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎంపిక చేసిన అభ్యర్థి కొలిన్ కాల్ భారత్- చైనా సరిహద్దు ఉద్రిక్తతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, ఆ ప్రాంతం సహా అమెరికా మిత్రదేశాల్లో పెరుగుతున్న దురాక్రమణలు.. చైనా దుందుడుకు వైఖరిని ప్రతిబింబిస్తుందన్నారు. డిఫెన్స్ అండర్ సెక్రటరీ ఫర్ పాలసీ పదవి కోసం తన ధ్రువీకరణ ప్రక్రియలో ఈ వ్యాఖ్యలు చేశారు కహల్.
అమెరికా తన మిత్ర, భాగస్వామ్య దేశాలకు అండగా నిలబడాలన్నారు కహల్. ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్రిక్తతలను తగ్గించడానికి ప్రయత్నించాలన్నారు. తాను పెంటగాన్‌కు ఎన్నికైతే.. పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తానని పేర్కొన్నారు కహల్. గత దశాబ్దంలో అమెరికా-భారత్ మధ్య రక్షణ వాణిజ్యం, సాంకేతిక సంబంధంలో బలంగా ఉన్నాయన్నారు కహల్. తనను ధ్రువీకరించినట్లయితే హై-ఎండ్ టెక్నాలజీపై దృష్టి సారించడం సహా ఈ బంధాన్ని కొనసాగించడానికి కృషి చేస్తానన్నారు.
ఇదీ చూడండి: అక్కడ కీలక మార్గం నిర్మించనున్న చైనా