కరోనాపై పోరులో భారత్ ముందువరుసలో ఉన్నట్లు అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) ముఖ్య ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ తెలిపారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వ్యాక్సిన్ అభివృద్ధి చేసి చాలా దేశాలకు సరఫరా చేస్తున్నందుకు భారత్‌పై ఆమె ప్రశంసలు కురిపించారు. భారత్ వ్యాక్సిన్ విధానాలు అద్భుతంగా ఉన్నాయన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రసంగించిన గీతా గోపీనాథ్ ఈ విధంగా స్పందించారు. ప్రపంచంలో వ్యాక్సిన్ హబ్ ఎక్కడుందని చూస్తే.. అది కచ్చితంగా భారతేనని గోపీనాథ్ పేర్కొన్నారు.
సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ)నూ గోపీనాథ్ ప్రశంసించారు. ఎస్ఐఐ భారీ సంఖ్యలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేసి.. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు వాటిని సరఫరా చేయడం అభినందనీయమన్నారు.
ఇదీ చదవండి:టీకా తీసుకుంటే మాస్క్ అవసరం లేదా?