ETV Bharat / international

తాలిబన్​ నాయకుడితో ట్రంప్ సంభాషణ ​

author img

By

Published : Mar 4, 2020, 10:31 AM IST

Updated : Mar 4, 2020, 2:26 PM IST

అమెరికా చరిత్రలోనే ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. అఫ్గాన్​లో​ శాంతి ఒప్పందం కుదిరిన నేపథ్యంలో అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్.. తాలిబన్​ నాయకుడితో ఫోన్​లో మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడి హోదాలో ఓ తాలిబన్​ నాయకుడితో మాట్లాడిన మొదటి వ్యక్తి ట్రంప్​ కావడం గమనార్హం.

In historic call, Trump speaks to Taliban leader, discusses peace in Afghanistan
ట్రంప్ చారిత్రక​ ఫోన్​కాల్​.. తాలిబన్​ నాయకుడితో సంభాషణ ​

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఏది చేసినా ప్రత్యేకమే. శ్వేతసౌధం​ తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ తన మార్క్​ చూపిస్తారు. ఇటీవల తాలిబన్లతో శాంతి ఒప్పందం కుదుర్చుకుని తనకు సాటెవ్వరూ లేరని నిరూపించుకున్నారు. తాజాగా తాలిబన్​ నాయకుడు ముల్లాహ్​ అబ్దుల్​ ఘనీతో ఫోన్​లో మాట్లాడి ప్రపంచ దేశాలను అశ్చర్యానికి గురిచేశారు.

ఓ తాలిబన్​ నాయకుడితో ఫోన్​లో మాట్లాడిన మొదటి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్ర సృష్టించారు. అఫ్గాన్​లో శాంతిని నెలకొల్పే విషయంపై ముల్లాహ్​తో ట్రంప్​ చర్చించినట్లు శ్వేతసౌధం ​తెలిపింది.

ఫిబ్రవరి 29న అమెరికా-తాలిబన్ల మధ్య శాంతి ఒప్పందం కుదరగా.. ఆ మరుసటి రోజే ఈ చారిత్రక ఫోన్​ సంభాషణ జరిగినట్లు శ్వేతసౌధం వర్గాలు వెల్లడించాయి. మార్చి 10న అఫ్గాన్​ ప్రభుత్వం-తాలిబన్ల మధ్య అంతర్గత చర్చలు జరగనున్నాయి.

"హింసను తగ్గించాల్సిన ఆవశ్యకతను ట్రంప్​ నొక్కిచెప్పారు. 40ఏళ్లుగా ఆ దేశంలో నెలకొన్న అస్థిరతను తొలగించేందుకు ఇస్లామిక్ రిపబ్లిక్ అఫ్గానిస్థాన్​ ప్రభుత్వ ప్రతినిధులతో జరిగే అంతర్గత చర్చల్లో తాలిబన్లు పాల్గొనాలని ట్రంప్​ చెప్పారు."

-శ్వేతసౌధం

తాను తాలిబన్​ నాయకుడు ముల్లాహ్​తో ఫోన్​​లో మాట్లాడానని, ఆ సంభాషణ బాగా సాగిందని చెప్పారు ట్రంప్​.

ఇదీ చూడండి: తాలిబన్​ ఒప్పందం.. భారత్​ భద్రతకు చేటు తెచ్చేనా?

Last Updated : Mar 4, 2020, 2:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.