ETV Bharat / international

బైడెన్ ప్రభుత్వ ఏర్పాటు సాఫీగా సాగేనా? - trump Joe Biden Transition challenges

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్​ కరోనా కట్టడి లక్ష్యంగానే తదుపరి కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై దృష్టిసారించినట్లు స్పష్టమవుతోంది. ఓవైపు కేబినెట్​లో స్థానం కోసం సన్నిహితుల నుంచి ఒత్తిళ్లు ఉండగా... ట్రంప్ సహకారంపై అనిశ్చితి నేపథ్యంలో అధికార బదిలీ ఎలా జరుగుతుందోనని ఆందోళన ఉంది.

How to build a government: Transition challenges await Biden
ప్రభుత్వ ఏర్పాటులో బైడెన్- ట్రంప్ సహకారంపై
author img

By

Published : Nov 8, 2020, 1:54 PM IST

అమెరికాకు కొత్త అధ్యక్షుడు ఎవరో తేలిపోయింది. డెమొక్రటిక్ నేత జో బైడెన్ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేశారు. ఇక ప్రభుత్వం ఏర్పాటు, అధికారిక లాంఛనాలు మిగిలున్నాయి. కానీ అసలు సవాలు ఆ తర్వాతే ఉంది.

అమెరికా తదుపరి అధ్యక్షుడికి పెను సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. వైద్య రంగంలో గత వందేళ్లలో ఎప్పుడూ లేని సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా మహమ్మారితో వైద్య వ్యవస్థపై తీవ్ర భారం పడింది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. అదే సమయంలో రిపబ్లికన్ల ఆధికం ఉండే సెనేట్​తో పనిచేస్తూ ప్రభుత్వాన్ని నిర్మించాల్సి ఉంటుంది.

దశాబ్దం పాటు సెనేటర్​గా, ఎనిమిది సంవత్సరాల పాటు ఉపాధ్యక్షుడిగా ఉన్న జో బైడెన్​కు ప్రభుత్వ పనితీరుపై లోతైన అవగాహన ఉంది. ఇదే స్థాయిలో ప్రభుత్వ కార్యకలాపాలపై అవగాహన ఉన్న అత్యుత్తమ సలహాదారులను తన బృందంలో చేర్చుకున్నారు బైడెన్. ఈ బృందానికి అపార అనుభవం ఉంది. బైడెన్ ఎదుర్కొనే సవాళ్లకు అనుగుణంగా దృష్టిసారిస్తూ పనిచేసే అవకాశం ఉంది.

ప్రమాణస్వీకారానికి ముందు ఆయన చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. కరోనా నియంత్రణకు పటిష్ఠమైన బృందాన్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. బైడెన్ సైతం ఇదే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. మహమ్మారి సమస్య కట్టడి కోసం తనకు సహకరించే శాస్త్రవేత్తల బృందాన్ని సోమవారం ప్రకటిస్తానని బైడెన్ తెలిపారు.

"కరోనాను నియంత్రణతోనే మా పని ప్రారంభమవుతుంది. వైరస్ కట్టడి జరగకపోతే.. ఆర్థిక వ్యవస్థను అమెరికన్లు పునరుద్ధరించలేరు. జీవితంలోని అత్యంత విలువైన క్షణాలను ఆస్వాదించలేరు."

-జో బైడెన్, అమెరికా తదుపరి అధ్యక్షుడు

జాతీయ ఆర్థిక మండలి డైరెక్టర్, హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీస్, ట్రెజరీ శాఖ సహా కరోనా కట్టడికి తనకు సహకరించే కీలకమైన కేబినెట్ శాఖలకు మంత్రులను బైడెన్ త్వరలోనే ఎంపిక చేసే అవకాశం ఉంది. బైడెన్ చీఫ్ ఆఫ్ స్టాఫ్​గా రోన్ క్లయిన్​ ఎంపికయ్యే అవకాశం ఉందని బైడెన్ అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. 2014లో ఎబోలా కట్టడికి ఒబామా బృందంలో కీలకంగా వ్యవహరించారు క్లయిన్.

విధేయులకు పట్టం!

2008లో బైడెన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తాత్కాలికంగా సెనేటర్ బాధ్యలు చేపట్టిన టెడ్ కాఫ్​మన్.. ప్రస్తుతం అధ్యక్ష అధికార బదిలీ ప్రక్రియను పర్యవేక్షించనున్నట్లు తెలుస్తోంది. ఒబామా హయాంలో కీలక పదవుల్లో కొనసాగిన జెఫ్ జియెంట్స్, జెన్ సాకి, యొహన్నెస్ అబ్రహంతో కాఫ్​మన్ పనిచేయనున్నారు.

బైడెన్ ప్రభుత్వంలో జియెంట్స్​కు ఉన్నత పదవి దక్కే అవకాశం లేకపోలేదని సమాచారం. చీఫ్ ఆఫ్ స్టాఫ్ పదవి లభించడాన్ని కొట్టిపారేయలేమని ఒబామా హయాంలో పనిచేసిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. బైడెన్ ప్రచారాన్ని నడిపించిన సీనియర్ అడ్వైజర్ అనితా డన్ సైతం కీలక పదవి దక్కించుకోనున్నట్లు తెలుస్తోంది.

సన్నిహితుల ఒత్తిళ్లు

చరిత్రలోనే వైవిధ్యమైన కేబినెట్​ను బైడెన్ ఏర్పాటు చేస్తారని సలహాదారులు చెప్తున్నారు. అయితే ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా ఇది సాధ్యం కాదు. బైడెన్​కు ఆఫ్రికన్ అమెరికన్ సలహాదారుడైన లూసియానా ప్రతినిధుల సభ సభ్యుడు సెడ్రిక్ రిచ్​మండ్​ను కేబినెట్​లో చూడాలని అనుకుంటున్నట్లు అధ్యక్షుడిగా పోటీకి నిలిచేందుకు సహాయం చేసిన దక్షిణ కరోలినా ప్రతినిధి జిమ్ క్లైబర్న్ ఇదివరకే వెల్లడించారు.

మొత్తంగా నాలుగు వేలకు పైగా రాజకీయ నేతలను బైడెన్ నియమించాల్సి ఉంటుంది. ఇందులో 1200 మందిని సెనేట్ ఆమోదించాల్సిన అవసరం ఉంది.

ట్రంప్ సహకరిస్తారా?

వేర్వేరు పార్టీలకు చెందినవారైనప్పటికీ.. పదవి నుంచి వైదొలిగే అధ్యక్షుడు, కాబోయే అధ్యక్షుడితో కలిసి పనిచేయడం, అధికారాలు బదిలీ చేయడం అమెరికాలో సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. 2009లో అధ్యక్షుడిగా ఒబామా బాధ్యతలు స్వీకరించినప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గడ్డు కాలాన్ని ఎదుర్కొంది. అప్పటివరకు అధ్యక్షుడిగా కొనసాగిన జార్జి బుష్ సంవత్సరం పాటు శ్రమించి అధికార బదిలీ కోసం ఫెడరల్ ఏజెన్సీలను సిద్ధం చేశారు. ఎలాంటి ఆటంకం లేకుండా ఈ ప్రక్రియ జరుగుతుందని బుష్ వ్యక్తిగతంగా హామీ ఇచ్చారు. కానీ, ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇందుకు సహకరిస్తారా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

అయితే బైడెన్ బృందంలోని సభ్యులు ట్రంప్ ప్రభుత్వానికి చెందిన సభ్యులతో నిశబ్దంగా చర్చించాలని రాజకీయ నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వంలో ఏమేం జరుగుతున్నాయి, ఎలాంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకోవాలని చెబుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.