ETV Bharat / international

రెస్టారెంట్​లో భోజనమా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! - restaurent dinner

మీకు ఇష్టమైన వారితో కలిసి రెస్టారెంట్​కు వెళ్లాలని ఆలోచిస్తున్నారా? ఒక్క క్షణం ఆగండి! అక్కడ చాలా ప్రమాదం ఉంది. అవును మీరనుకుంటున్నదే... కరోనా మహమ్మారి! ఆ వైరస్​ నుంచి కాపాడుకుంటూనే రెస్టారెంట్లకు వెళ్లొచ్చని నిపుణులు చెబుతున్నారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని స్పష్టం చేస్తున్నారు. మరి ఏంటి ఆ జాగ్రత్తలు?

How risky is dining out during the COVID-19 pandemic?
ఈ జాగ్రత్తలు పాటించి ఎంచక్కా రెస్టారెంట్​కు వెళ్లండి!
author img

By

Published : Jul 9, 2020, 5:46 PM IST

ప్రియమైన వారితో కలిసి అలా బయటకు వెళ్లి ఎంత కాలమైందో! సరదాగా కాసేపు బయట తిరుగుదామంటే కరోనా ఎక్కడ తగులుకుంటుందోనని భయం. రొమాంటిక్​గా ఏ క్యాండిల్ లైట్ డిన్నరో... రెస్టారెంట్​లో వేడివేడి బిర్యానో తిందామన్నా భయమే. ఇంకా ఎన్ని రోజులని ఇలా లెక్కలేసుకుంటూ కూర్చోవాలి. ఎప్పుడో ఓసారి బయటకు రావాల్సిందే, వెళ్లి తినాల్సిందే. కదా! మరి అలాంటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కరోనాను ఇంటికి తీసుకెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి?

ఇవి పాటించండి

కరోనా కాలంలో బయట భోజనం చేయడం రిస్క్​ అయినప్పటికీ... కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ ముప్పును తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. వైరస్​ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి కొన్ని సలహాలు ఇస్తున్నారు. అమెరికాకు చెందిన వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం(సీడీసీపీ) ఈ మేరకు పలు సూచనలు జారీ చేసింది. హోండెలివరీలకే ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది. అయితే రెస్టారెంట్​లకు వెళ్లే వాళ్లు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

  • రెస్టారెంట్ల లోపల వైరస్ ముప్పు ఎక్కువగా ఉంటుంది. వెంటిలేషన్ సరిగా ఉండదు కాబట్టి ఇండోర్​ రెస్టారెంట్లు ప్రమాదకరం.
  • రెస్టారెంట్​లో భోజనం చేయాలని అనుకుంటే అవుట్​డోర్​ సీటింగ్ ఉన్న ప్రాంతాలు ఉత్తమం.
  • టేబుళ్లకు మధ్య కనీసం 6 అడుగుల దూరం ఉండే రెస్టారెంట్​లు చూసుకోవాలి.
  • సురక్షితమైన ఆహారం అందించేందుకు రెస్టారెంట్లు తీసుకుంటున్న చర్యలను తెలుసుకోవాలి.
  • సర్వర్లు మాస్కులు ధరిస్తున్నారా, లేదా చూసుకోవాలి.
  • టేబుల్​ కోసం ఎదురుచూసేటప్పుడు ఎక్కువ మంది గుమిగూడకుండా రెస్టారెంట్ తీసుకుంటున్న జాగ్రత్తలు పరిశీలించాలి.
  • ఒకసారి వాడిపాడేసే పాత్రలు ఉపయోగించే రెస్టారెంట్లు ఉత్తమం.
  • వస్తువులను తాకకుండా చేసే చెల్లింపు పద్ధతులు పాటించాలి.
  • ఎక్కువ మంది ఉన్న చోట భోజనం చేయాల్సి వస్తే.. మీకు తెలిసినవారితోనే తినండి.
  • చుట్టుపక్కల ఎవరికైనా అనారోగ్య లక్షణాలు ఉన్నాయో పరిశీలించుకోండి.
  • తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యే వ్యక్తులు, వృద్ధులు రెస్టారెంట్లలో భోజనం చేయకపోవడమే మంచిది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.