ETV Bharat / international

అమెరికాలో ఘోర ప్రమాదం-15 మంది మృతి - సౌత్​ కాలిపోర్నియాలో రోడ్డు ప్రమాదం

అమెరికా దక్షిణ​ కాలిఫోర్నియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 15 మంది చనిపోయారు. మరో 12 మందికి గాయాలయ్యాయి.

Hospital: SUV carrying 27 crashes with semitruck, killing 15
అమెరికాలో ఘోర ప్రమాదం-15 మంది మృతి
author img

By

Published : Mar 3, 2021, 1:35 AM IST

Updated : Mar 3, 2021, 1:48 AM IST

అమెరికా దక్షిణ​ కాలిఫోర్నియాలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 15 మంది మరణించారు. మరో 12మంది గాయపడ్డారు. ఎస్​యూవీ, ట్రక్కు ఢీకొని ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటన సమయంలో ఎస్​యూవీ వాహనంలో మొత్తం 27 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంలో క్షతగాత్రులైన వారిని స్థానికంగా ఉండే ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.

Hospital: SUV carrying 27 crashes with semitruck, killing 15
ఢీకొన్న ట్రక్​, ఎస్​యూవీ

ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న అధికారులు

ఘటన జరిగిన ప్రాంతం అమెరికా, మెక్సికో సరిహద్దుకు 18 కి.మీ దూరంలో ఉన్నట్లు అక్కడి అత్యవసర సేవా విభాగం డైరెక్టర్​ జూడీ క్రజ్​ తెలిపారు. చనిపోయిన వారు వ్యవసాయ కూలీలు అయి ఉంటారని అనుమానిస్తున్నారు.

ఇదీ చూడండి: 12వ అంతస్తు నుంచి పడిన చిన్నారి- క్యాచ్ పట్టిన డ్రైవర్​

Last Updated : Mar 3, 2021, 1:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.