ఆసియా అమెరికన్లు ఎక్కువగా మాట్లాడే భాషల్లో హిందీ టాప్ 5లో ఉంటుందని ఏషియన్ అమెరికన్స్ అడ్వాన్సింగ్ జస్టిస్(ఏఏజేసీ) తెలిపింది. మూడింట రెండొంతల మంది ఆసియా అమెరికన్లు వలసదారులని ఏఏజేసీ అధ్యక్షుడు జాన్ యాంగ్ పేర్కొన్నారు. ఇందులో 52 శాతం మందికి లిమిటెడ్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ(ఆంగ్లం సరిగ్గా మాట్లాడలేకపోవడం) సమస్య ఉందని స్పష్టం చేశారు.
"ఆసియన్ అమెరికన్ కమ్యూనిటీల్లో ఎల్ఈపీ రేట్లు భిన్నంగా ఉంటాయి. వీరు మాట్లాడే భాషల్లో.. చైనీస్, టగలాగ్, వియత్నమీస్, కొరియన్, హిందీ టాప్ 5లో ఉంటాయి."
-జాన్ యాంగ్, ఏఏజేసీ అధ్యక్షుడు.
వలసవాదుల్లో.. 66 శాతం చైనీయులు, 35 శాతం ఫిలిప్పీన్స్ వారు, 72 శాతం వియత్నాం వారు, 64 శాతం కొరియా దేశస్థులు, 29 శాతం భారతీయులు.. ఆంగ్లం కొద్ది మేరకే మాట్లాడగలుగుతున్నారని యాంగ్ వెల్లడించారు. అందరిలోకెల్లా అమెరికాలో నివసిస్తోన్న బర్మా వారిలో అధికంగా 79 శాతం మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:అమెరికాలో భారీగా కేసులు- టీకా ఉత్పత్తికి 'క్వాడ్' సన్నాహాలు