ETV Bharat / international

కరోనాకు ఈ రెండు మాత్రలు కలిపివాడితే నష్టమేనా? - corona virus precautions

కరోనా చికిత్సకు హైడ్రాక్సీ క్లోరోక్విన్​ దీర్ఘకాలికంగా వాడితే నష్టమేనని తాజా నివేదికలు చెబుతున్నాయి. గరిష్ఠంగా 30 రోజుల పాటు వాడితే ఎలాంటి సమస్య లేదని నివేదించాయి. అయితే హెచ్​సీక్యూతోపాటు అజిత్రోమైసిన్​ కలిపి వాడితే హృద్రోగ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు.

HCQ AZM
కరోనా
author img

By

Published : Aug 26, 2020, 8:55 PM IST

కరోనా చికిత్సలో భాగంగా హైడ్రాక్సీక్లోరోక్విన్‌తోపాటు అజిత్రోమైసిన్‌ మాత్రలను ఒకేసారి వాడడం వల్ల హృద్రోగ సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఒక్కోసారి వీటివల్ల ప్రాణాలకే ప్రమాదం పొంచివుందని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

అయితే స్వల్పకాలిక కోర్సులో భాగంగా హెచ్​సీక్యూ 30 రోజుల పాటు వాడితే ఎలాంటి ప్రమాదం లేదని, దీర్ఘకాలికంగా వాడితేనే హృద్రోగ సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. దీర్ఘకాలికంగా హెచ్​సీక్యూ వాడటం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ఏప్రిల్‌లోనే యూరోపియన్‌ మెడిసిన్స్‌ ఏజన్సీ(ఈఎంఏ) కూడా హెచ్చరించింది.

మరింత పరిశోధనలు జరిపిన అనంతరం మరో నివేదిక దీన్ని స్పష్టం చేసింది. తాజాగా ఈ పరిశోధన నివేదిక ప్రముఖ అంతర్జాతీయ జర్నల్‌ లాన్సెట్‌ రూమటాలజీ, MedRxivలోనూ ప్రచురితమైంది.

పరిశోధనలు జరగాల్సి ఉన్నా..

కరోనావైరస్‌ విజృంభిస్తోన్న సమయంలో ప్రపంచవ్యాప్తంగా మలేరియాకు ఉపయోగించే హెచ్​సీక్యూ నియంత్రిస్తోన్నట్లు నిపుణులు అంచనా వేశారు. ఫలితంగా ఈ మందుల వాడకం పెరిగింది. దీనిపై విస్తృత పరిశోధనలు జరగాల్సి ఉందని అంతర్జాతీయ నిపుణులు ఇప్పటికే సూచించారు. ప్రస్తుతం ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం, 30 రోజుల స్వల్పకాలిక కోర్సు వల్ల ప్రమాదమేమీ లేదని తేలింది.

20 ఏళ్ల సమాచారం ఆధారంగా..

కానీ వీటిని దీర్ఘకాలికంగా అజిత్రోమైసిన్‌తో కలిపి వాడితేనే ప్రమాదమని పరిశోధన పత్రాన్ని రూపొందించిన డానియల్ ప్రైటో అల్హాంబ్రా వెల్లడించారు. గడిచిన 20 సంవత్సరాలలో హెచ్​సీక్యూ వాడిన దాదాపు 9.50లక్షల మంది సమాచారాన్ని క్రోడీకరించిన అనంతరం దీన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు. జర్మనీ, జపాన్‌, నెదర్లాండ్స్‌, స్పెయిన్‌, యూకే, అమెరికా దేశాలకు చెందిన సమాచారాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకున్నామని తెలిపారు. అయితే దీనికి సంబంధించిన సమాచారంపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని ఆరోగ్యరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అమెరికాలోనూ..

కరోనా వైరస్‌ చికిత్సలో ప్రతిఒక్కరికీ హైడ్రాక్సీక్లోరోక్విన్‌ వాడవద్దని తాజాగా అమెరికా అంటువ్యాధుల సొసైటీ(ఐడీఎస్‌ఏ) కూడా సూచించింది. అంతేకాకుండా వీటికి సంబంధించిన తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇదిలా ఉంటే, కరోనా చికిత్సలో హెచ్​సీక్యూ ఆశించిన ఫలితాలు చూపించడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా పలుసార్లు అభిప్రాయపడిన విషయం తెలిసిందే.

ఇదీ చూడండి: యూపీలో కరోనా విలయం- ఒక్కరోజే 5,900 కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.