ETV Bharat / international

భారత్​ నుంచి అమెరికా చేరుకున్న మలేరియా మాత్రలు

కరోనా రోగుల చికిత్సలో ఉపయోగించే డ్రగ్​ను భారత్ అగ్రరాజ్యానికి ఎగుమతి చేసింది. ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ అభ్యర్థన మేరకు 35.82 లక్షల హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలను అమెరికాకు పంపించింది. ఈ ఔషధాలు న్యూయార్క్ చేరుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. బ్రిటన్​కు సైతం పారాసిటమాల్ ప్యాకెట్లను ఎగుమతి చేసింది భారత్.

HCQ consignment from India arrives in US
హైడ్రాక్సీక్లోరోక్విన్ అమెరికా భారత్
author img

By

Published : Apr 12, 2020, 10:25 AM IST

కరోనాపై పోరులో ప్రపంచ దేశాలకు అండగా ఉంటానన్న భారత్.. తన మాట నిలబెట్టుకుంది. అమెరికా, బ్రిటన్​లకు ఔషధాలను ఎగుమతి చేసింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థన మేరకు 35.82 లక్షల హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలను అమెరికాకు ఎగుమతి చేసింది. వీటితో పాటు ఈ డ్రగ్ ఉత్పత్తిలో వినియోగించే ముడిపదార్థాలనూ ఆ దేశానికి పంపించింది.

"కొవిడ్-19పై చేస్తున్న పోరాటంలో భాగస్వామ్య దేశాలకు చేయూతనివ్వడంలో భాగంగా భారత్ పంపించిన హైడ్రాక్సీక్లోరోక్విన్ ఔషధాలు న్యూయార్క్ విమానాశ్రయానికి చేరుకున్నాయి."-తరణ్​​జిత్ సింగ్ సంధూ, అమెరికాలోని భారత రాయబారి

గత వారం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఫోన్​లో సంభాషణలో భాగంగా హైడ్రాక్సీక్లోరోక్విన్ ఎగుమతిపై నిషేధం ఎత్తివేయాలని కోరారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.

బ్రిటన్​కు పారాసిటమాల్

బ్రిటన్​కు సైతం భారత్ సహాయంగా ఔషధాలను ఎగుమతి చేసింది. భారత్ పంపిన 30 లక్షల పారాసిటమాల్ ప్యాకెట్లు నేడు బ్రిటన్​కు చేరుకోనున్నాయి. ఈ సహాయానికిగానూ ఆ దేశ విదేశాంగ(దక్షిణాసియా వ్యవహారాలు) సహాయ మంత్రి తారిక్ అహ్మద్ భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కొవిడ్-19ను ఎదుర్కొనేందుకు ఇరుదేశాలు తమ సహకారాన్ని కొనసాగిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

భారత్​లోనే అధికంగా లభ్యం

ప్రపంచవ్యాప్తంగా చూస్తే హైడ్రాక్సీక్లోరోక్విన్ భారత్ నుంచే అధికంగా(70శాతం) ఉత్పత్తి అవుతోంది. దేశీయ అవసరాల నిమిత్తం కొవిడ్ చికిత్సలో ఉపయోగించే ఈ డ్రగ్​ ఎగుమతులపై భారత్ మొదట నిషేధం విధించింది. వివిధ దేశాల అభ్యర్థనతో పాటు దేశంలో డ్రగ్ నిల్వలు సరిపడా ఉండటం వల్ల ఈ నిషేధాన్ని ఏప్రిల్ 7న సడలించింది. ప్రపంచ దేశాలకు సహకారం అందించడానికి మానవతా దృక్పథంతో ఈ నిర్ణయం తీసుకుంది.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.