ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' సిరీస్ మీమ్స్‌ను ఉపయోగించకూడదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను మరోసారి కోరింది హెచ్‌బీఓ సంస్థ. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం లేదని యూఎస్ అటార్నీ జనరల్ బిల్ బార్ పునరుద్ఘాటించారు. ఈ ప్రకటన నేపథ్యంలో గేమ్ ఆఫ్ థ్రోన్స్ మీమ్‌తో ఒక ట్వీట్ చేశారు ట్రంప్.
- — Donald J. Trump (@realDonaldTrump) April 18, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
— Donald J. Trump (@realDonaldTrump) April 18, 2019
">— Donald J. Trump (@realDonaldTrump) April 18, 2019
"కుట్ర లేదు, ఆటంకం లేదు. ద్వేషించేవారికి, లెఫ్ట్ డెమొక్రాట్లకు ఆట ముగిసింది" అని గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫాంట్‌తో ఆంగ్లంలో రాసి ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు.
ట్రంప్ ట్వీట్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ... ఓ ప్రకటన విడుదల చేసింది హెచ్‌బీఓ సంస్థ.
"గేమ్ ఆఫ్ థ్రోన్స్పై ఉన్న ఆసక్తిని మేము అర్థం చేసుకోగలం. ఈ మధ్యే ఫైనల్ సిరీస్ విడుదలైంది. అయినప్పటికీ మా మేధో సంపత్తిని రాజకీయాలకు వినియోగించకూడదనేదే మా ఉద్దేశం."
- హెచ్‌బీఓ సంస్థ
ట్రంప్... గతంలోనూ
గతేడాది నవంబర్లోనూ గేమ్ ఆఫ్ థ్రోన్స్ మీమ్‌తో ఓ ట్వీట్ చేశారు ట్రంప్. అప్పుడే హెచ్‌బీఓ సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసింది. షో నినాదాలను దుర్వినియోగం చేయొద్దని ట్రంప్‌ను కోరింది.
ఇదీ చూడండి : టైగర్‌వుడ్స్‌పై బెట్... మిలియన్ డాలర్ల హిట్