కరోనా వార్తలను చూసి అనవసర భయాందోళనకు గురయ్యేవారికి ఓ సలహా ఇస్తున్నారు అమెరికా హార్వార్డ్ వైద్య కళాశాల మనో వైద్యులు. యోగా, ధ్యానం వంటివి చేస్తే మనసు కాస్త కుదుటపడుతుంటున్నారు.
అమెరికాలో ఇప్పటికే 3,485 మంది కరోనా బారినపడ్డారు. 65 మంది వైరస్‌తో మృతి చెందారు. ఈ వార్తలు విని ఆ దేశంలో చాలా మంది అనవసరంగా కంగారు పడుతున్నారు. వైరస్ తమను ఎప్పుడు ఎలా దాడి చేస్తుందోనని భయపడతూ మానసికంగా కుంగిపోతున్నారు.
అందుకే, యోగా ఆసనాలు, ధ్యానం, ప్రాణాయామం వంటి అభ్యాసాలు చేయాలని సూచిస్తోంది హార్వార్డ్ వైద్య కళాశాల. ఇప్పటికే ఎంతోమంది ఇలా యోగా చేసి సత్ఫలితాలు పొందారని, కరోనా భయాన్ని జయించి ప్రశాంతంగా ఉన్నారని స్పష్టం చేసింది.
"నిత్యం ధ్యానం చేయడం నిజంగా చాలా ప్రశాంతతను ఇస్తుంది. ధ్యానం ఎలా చేయాలో తెలుసుకోవడానికి హెడ్‌స్పేస్, కామ్ వంటి ఎన్నో యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇక యోగా ఇదివరకు ఎన్నడూ చేయకపోయినా.. ఇప్పుడు ప్రారంభించండి. యోగాతో మీ దృష్టి కరోనా నుంచి ఆరోగ్యంవైపు మళ్లుతుంది. అందుకు యోగా స్టూడియో, పాకెట్ యోగా వంటి యాప్‌లను అనుసరించవచ్చు."
-జాన్ షార్ప్, హార్వార్డ్ మనోవైద్యుడు
మరో వైపు ఉత్తర అమెరికాలో 'ప్రపంచ హిందూ కాంగ్రెస్' సభ్యులు కొవిడ్-19ను జయించేందుకు యజ్ఞాలు, కరోనా శాంతి పూజలు చేస్తున్నారు.
ఇదీ చదవండి: