ETV Bharat / international

నవ్వులు పూయిస్తున్న మహిళ ప్రవర్తన.. ఏమైందంటే? - ట్విట్టర్​ వీడియో

నెట్టింట్ట​ ఓ వీడియో నవ్వులు పూయిస్తోంది. ఓ మహిళ సెలూన్​కు వెళ్లి జుట్టు శుభ్రం చేసుకునే సమయంలో హెయిర్​ డ్రెస్సర్​కు చిరాకు తెప్పించింది. ఆ హెయిర్​ డ్రెస్సర్​ పనికి ఆటంకం కలిగిస్తూ పక్కనే ఉన్న తన స్నేహితురాలితో మాట్లాడుతూనే ఉంది. చివరికి ఆ హెయిర్​ డ్రెస్సర్​ ఏం చేశాడంటే..!

hair dresser
హెయిర్​ డ్రెస్సర్​
author img

By

Published : Jul 12, 2021, 12:05 PM IST

కొందరు షాపింగ్​కి వెళ్లో, రెస్టారెంట్​కు వెళ్లో.. అక్కడి సిబ్బందిని వివిధ రకాల ప్రశ్నలతో విసిగిస్తూ ఉంటారు. సిబ్బంది ఎంతో సహనంతో వారికి సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే వాళ్లు మనుషులే కదా! ఒక్కోసారి వారూ సహనం కోల్పోతారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ తన ప్రవర్తనతో అక్కడి హెయిర్​ డ్రెస్సర్​కు చిరాకు తెప్పించి.. చివరికి భంగపాటుకు గురైంది.

నవ్వులే నవ్వులు..

ఓ మహిళ తన స్నేహితురాలితో కలిసి సెలూన్​కు వెళ్లింది. జుట్టు శుభ్రం చేసుకునేందుకు కూర్చుంది. సెలూన్​ సిబ్బంది ఒకరు నీళ్లతో ఆమె జుట్టు కడగడం మొదలు పెట్టారు. ఇంతలో తన స్నేహితురాలితో మాట్లాడటం మొదలు పెట్టింది ఆ మహిళ. పదేపదే లేచి కబుర్లు చెప్పింది. ఆ హెయిర్​ డ్రెస్సర్​​ ఎన్నిసార్లు చెప్పినా వినలేదు.

అలా చాలాసార్లు లేస్తూనే ఉండి తన స్నేహితురాలితో మాట్లాడుతూనే ఉంది. ఇక సహనం కోల్పోయిన ఆ హెయిర్​ డ్రెస్సర్​.. పైపుతో ఆమె మొఖం మొత్తం నీళ్లు కొట్టాడు. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాకు చిక్కాయి.

ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఈ 44సెకన్ల వీడియో చూసిన వారు నవ్వు ఆపుకోలేకపోతున్నారు.

ఇదీ చూడండి:- ఏం పని చేయకుండానే.. రెండు చేతులా సంపాదన!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.