ETV Bharat / international

హెచ్​1బీ వీసా రిజిస్ట్రేషన్​కు డేట్స్​ ఫిక్స్

H1B visa registration: హెచ్​1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారికి శుభవార్త. త్వరలోనే ఈ ఏడాదికి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. మార్చి 1న ఈ ప్రక్రియ మొదలవుతుందని అమెరికా ఇమ్మిగ్రేషన్​ వర్గాలు వెల్లడించాయి.

h1b visa
హెచ్​1బీ వీసా
author img

By

Published : Jan 30, 2022, 4:03 PM IST

Updated : Jan 30, 2022, 4:57 PM IST

H1B visa registration: అమెరికా హెచ్​1బీ వీసా రిజిస్ట్రేషన్​ తేదీలను ప్రకటించింది ఆ దేశ ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీ. మార్చి 1న దరఖాస్తుదారులకు వీసా రిజిస్ట్రేషన్​ అందుబాటులోకి వస్తుందని తెలిపింది. మార్చి 18 వరకు రిజిస్ట్రేషన్​కు అవకాశం ఉంటుందని.. ఆన్​లైన్​ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని చెప్పింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఎంపికైన వారికి మార్చి నెలాఖరుకు వివరాలు తెలియజేస్తామని పేర్కొంది.

ఓ అకౌంట్​ నుంచి ఒకరి కన్నా ఎక్కువ మంది దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ఇమ్మిగ్రేషన్​ అధికారులు వెల్లడించారు. ఈ అకౌంట్​ ద్వారా వారి వివరాలు నమోదు చేసుకోవచ్చని తెలిపారు.

అత్యధికంగా ఓ ఏడాదిలో దాదాపు 65,000 హెచ్​1బీ వీసాలకు అమెరికా అనుమతిస్తుంది. ఇందుకు అదనంగా విదేశీ విద్యార్థులకు మరో 20వేల వీసాలను జారీ చేస్తుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్​ ఉచితం!

ఇదీ చూడండి : రెండు దేశాల మధ్య యుద్ధవాతావరణం.. ఆ అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు

Last Updated : Jan 30, 2022, 4:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.