ETV Bharat / international

మార్చి 9 నుంచి హెచ్-1బీ వీసాల రిజిస్ట్రేషన్ - USCIS

హెచ్-1బీ వీసాల దరఖాస్తు ప్రక్రియ మార్చి 9 నుంచి ప్రారంభంకానున్నట్లు అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ శాఖ తెలిపింది. సంప్రదాయ లాటరీ పద్దతి ద్వారా ఎంపిక చేసిన అభ్యర్థులను మార్చి 31 నాటికి ప్రకటిస్తామంది. అక్టోబర్​ 1 నుంచి నూతన ఉద్యోగం ప్రారంభించవచ్చని పేర్కొంది.

H-1B visa registration for 2022 to begin on Mar 9, lottery results to be notified by Mar 31
'మార్చి 9 నుంచి హెచ్-1బీ వీసాల జారీ ప్రక్రియ షురూ'
author img

By

Published : Feb 7, 2021, 5:36 AM IST

విదేశీయులు అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు ఇచ్చే హెచ్-1బీ వీసాల.. రిజిస్ట్రేషన్​ ప్రక్రియ మార్చి 9 నుంచి ప్రారంభం కానున్నట్లు అగ్రరాజ్య పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్​ శాఖ తెలిపింది. లాటరీ పద్దతి ద్వారా ఎంపికైన అభ్యర్థుల వివరాలను మార్చి 31 నాటికి ప్రకటిస్తామని వివరించింది. అక్టోబర్​ 1 నుంచి ఉద్యోగం ప్రారంభించవచ్చని పేర్కొంది.

లాటరీ విధానం కొనసాగింపు

మార్చి 9న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్​ ప్రక్రియ మార్చి 25 వరకు ఉంటుందని అమెరికా ఇమ్మిగ్రేషన్ శాఖ పేర్కొంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ నేతృత్వంలో తీసుకొచ్చిన హెచ్-​1బీ వీసా నిబంధనల మార్పుల అమలును వాయిదా వేస్తున్నట్లు నూతన అధ్యక్షుడు జో బైడెన్ ఇప్పటికే తెలిపారు​. లాటరీ విధానాన్ని పొడిగించనున్నట్లు వివరించారు.

ఏటా 65 వేల మందికి..

వీసా జారీ ప్రక్రియ ద్వారా ఎంపికైన అభ్యర్థులు అమెరికా ఆర్థిక సంవత్సరం మొదలయ్యే అక్టోబరు 1 నుంచి... నూతన ఉద్యోగం ప్రారభించవచ్చు. అమెరికా ఇమ్మిగ్రేషన్ శాఖ ఏటా 65వేల మందికి హెచ్​-1బీ వీసాలను జారీ చేస్తుంది. అంతేకాక 20వేల వీసాలను విదేశీ విద్యార్థులకు ఇస్తుంది.

హెచ్​-1బీ వీసా అంటే?

'హెచ్‌-1బీ' అనేది వలసేతర వీసా. నిపుణులైన విదేశీయులను ఉద్యోగాల్లో నియమించుకునేందుకు ఈ వీసా విధానం అమెరికా కంపెనీలకు వీలు కల్పిస్తుంది. దాని ద్వారా భారత్‌, చైనా తదితర దేశాల నుంచి ఏటా వేల సంఖ్యలో ఐటీ నిపుణులు అమెరికా వెళ్లగలుగుతున్నారు.

ఇదీ చదువండి : ట్రంప్​కు ఆ విషయాలు చెప్పబోం: బైడెన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.