ETV Bharat / international

'చిల్​ డొనాల్డ్' అంటూ ట్రంప్​కు గ్రెటా 'రివర్స్​ పంచ్​' - So ridiculous. Donald must work on his anger management problem, then go to a good old fashioned movie with a friend! Chill, Donald, Chill

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​, 17 ఏళ్ల ఉద్యమకారిణి గ్రెటా థెన్​బెర్గ్​ గట్టి కౌంటర్​ వేసింది. వీరిద్దరి మధ్య గతంలోని ట్వీట్ల పోరుకు మళ్లీ తెరపైకి వచ్చింది. 2019లో ట్రంప్​ వెటకారంగా పోస్ట్ చేసిన ఓ ట్వీట్​ను తాజాగా గుర్తుచేసింది గ్రెటా. అధ్యక్ష ఎన్నికల్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న ట్రంప్​కు ఆయన ట్వీట్​తోనే కౌంటర్​ ఇచ్చింది.

Greta Thunberg
చిల్​ డొనాల్డ్​, చిల్​..! ట్రంప్​కు గ్రెటా రివర్స్​ పంచ్​
author img

By

Published : Nov 6, 2020, 3:44 PM IST

Updated : Nov 6, 2020, 5:06 PM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​, 17 ఏళ్ల ​ఉద్యమకారిణి గ్రెటా థన్​బెర్గ్​ మధ్య మళ్లీ ట్వీట్ల రగడ మొదలైంది. అధ్యక్ష ఎన్నికల ఫలితాలు తేలక గందరగోళంలో ఉన్న ట్రంప్​పై.. తనదైన రీతిలో పంచ్​లు వేసింది ఈ స్వీడన్​ అమ్మాయి​. గతంలో తనను విమర్శించినందుకు ప్రతిగా కౌంటర్​ వేసి.. వార్తల్లో నిలిచింది.

అధ్యక్ష ఎన్నికల్లో అవినీతి, అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న ట్రంప్​.. 'లెక్కింపు ఆపండి' అంటూ గురువారం ట్వీట్​ చేశారు. దీనిపై స్పందించిన థన్​బెర్గ్​ గురువారం ఆయన ట్వీట్​తోనే వ్యంగ్యంగా సమాధానమిచ్చింది.

Greta Thunberg
17 ఏళ్ల ఉద్యమకారిణి గ్రెటా థెన్​బెర్గ్​
  • So ridiculous. Donald must work on his Anger Management problem, then go to a good old fashioned movie with a friend! Chill Donald, Chill! https://t.co/4RNVBqRYBA

    — Greta Thunberg (@GretaThunberg) November 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఇది హాస్యాస్పదం. ట్రంప్​ తన కోపాన్ని నియంత్రించుకోవడంపై దృష్టిపెట్టాలి. వీలైతే తన స్నేహితుడితో కలిసి ఓ పాత సినిమాకు వెళ్లాలి! చిల్ డొనాల్డ్​, చిల్!".

- ట్విట్టర్​లో గ్రెటా థన్​బెర్గ్​

ఆనాటి మాటకు ఇలా...

గతంలో థన్​బెర్గ్​పైనా డొనాల్డ్​ ఇదే తరహాలో విమర్శలు చేశారు. ప్రముఖ టైమ్స్ మ్యాగజైన్... 'పర్సన్​ ఆప్ ద ఇయర్ 2019'గా గ్రెటా థెన్​బెర్గ్ ఫొటోను మ్యాగజైన్ కవర్ పేజీపై ఉంచినట్లు ప్రకటించింది. ఆ సమయంలో అందరూ ప్రశంసిస్తుంటే ట్రంప్​ మాత్రం వెటకారంగా మాట్లాడారు. ఆ సమయంలో ట్రంప్​ ఓ ట్వీట్​ చేయగా.. అప్పుడే చిన్నపాటి కౌంటర్​ కూడా ఇచ్చింది థన్​బర్గ్​. ఆయన చెప్పినట్లే వ్యంగ్యంగా తన ట్విట్టర్ బయోను మార్చింది. తాజాగా అమెరికా ఎన్నికల ఫలితాలపై ఆగ్రహంతో ఉన్న డొనాల్డ్​కు.. ఆనాడు తనకు ఇచ్చిన సలహానే సూచిస్తూ రివర్స్​ పంచ్​ ఇచ్చింది థన్​బెర్గ్​.

వాతావరణ మార్పులపై ప్రపంచ దేశాల పాలకులు నూతన విధానాలు రూపొందించాలని 'గ్లోబల్‌ యూత్‌ మూమెంట్‌' పేరుతో ఏడాది కాలంగా పోరాటం చేస్తోంది ఈ స్వీడన్‌ బాలిక థన్​బెర్గ్​.

ఇదీ చూడండి:

Last Updated : Nov 6, 2020, 5:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.