సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్బుక్పై ట్రంప్ నేతృత్వంలోని అమెరికా అధికార యంత్రాంగం మండిపడింది. అమెరికా ఉద్యోగులపై వివక్ష చూపుతోందని ఆరోపించింది. విదేశీయులకు ప్రత్యేక వీసాలను ఇప్పించి.. 2,600కిపైగా ఉద్యోగాలను ఫేస్బుక్ కల్పించిందని విమర్శించింది. ఈ మేరకు ఆ సంస్థపై అమెరికా న్యాయ శాఖ పిటిషన్ దాఖలు చేసింది.
అర్హత కలిగిన అమెరికా వాసులను కాదని ఫేస్బుక్ తమ సంస్థలో తాత్కాలిక వీసాదారులుకు ఉద్యోగాలు కల్పిస్తోందని న్యాయ శాఖ తన పిటిషన్లో పేర్కొంది. వారిని శాశ్వత ఉద్యోగులుగా మార్చుకునేందుకు గ్రీన్కార్డులందించండ లోనూ సాయపడిందని ఆరోపించింది. ఈ ఉద్యోగాల ద్వారా విదేశీయులకు సగటున రూ.1.15 కోట్ల జీతాన్ని ఫేస్బుక్ చెల్లిస్తుందని దుయ్యబట్టింది. ఇందుకు గాను.. అమెరికా వాసులకు ఫేస్బుక్ పరిహారం చెల్లించాలని న్యాయశాఖ డిమాండ్ చేసింది.