అపోలో 11 విషన్ ద్వారా అమెరికా 50 ఏళ్ల క్రితం చరిత్ర సృష్టించింది. నాసా వ్యోమగాములు నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్, మైఖేల్ కాలిన్స్ చంద్రునిపైకి వెళ్లిన రాకెట్లో ఉన్నారు. జాబిల్లిపై అడుగుపెట్టిన మెదటి వ్యక్తిగా నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చరిత్ర నెలకొల్పారు.
చంద్రుడిపై తొలి అడుగు అర్ధ శతాబ్దం పూర్తయిన సందర్భంగా ఓ వీడియోతో ప్రత్యేక డూడుల్ రూపొందించింది గూగుల్. ఆ వీడియోలో అపోలో 11 మిషన్ ఎలా జరిగిందో తన గొంతుతో స్వయంగా వినిపించారు కాలిన్స్. భూమిపై నుంచి చంద్రుని మీదకు రాకెట్ ఎలా వెళ్లిందో కళ్లకు గట్టినట్టు యానిమేషన్ దృశ్యాలు చూపిస్తూ సవివరంగా చెప్పారు.
"హాయ్ అయామ్ మైక్ కాలిన్స్. 50 ఏళ్ల క్రితం నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్‌లతో కలిసి అపోలో 11లో ఓ సాహస యాత్రకు బయలుదేరాను" అని మొదలైన వీడియో... వారు జాబిల్లిని ఎలా చేరుకున్నారు, ప్రయాణం మధ్యలో జరిగిన పరిణామాలు, ప్రయోగం విజయవంతమైన అనంతరం పారాషూట్ సాయంతో సముద్రంపై ల్యాండ్ అయిన తీరును యానిమేషన్ రూపంలో వివరించారు కాలిన్స్.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
వీడియోలో కాలిన్స్ చెప్పిన పలు కీలక విషయాలు
- భూమిపై నుంచి 1969 జులై 16న అపోలో 11 నింగికెగిసింది.
- ఈ ప్రయోగంలో ఇంజనీర్ల నుంచి, కంప్యూటర్ ప్రోగ్రామర్ల వరకు మొత్తం 4లక్షల మంది కృషి ఉంది.
- నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ జులై 20న చంద్రునిపై కాలు మోపారు.
- జాబిల్లికి కొన్ని మైళ్ల దూరంలో ఏకాంతంగా ఉన్నారు కాలిన్స్.
- జులై 24న భూమ్మీదకు చేరుకున్నారు. పిసిఫిక్ సముద్రంలో పారాషూట్ సాయంతో దిగారు