అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. జార్జియా రాష్ట్రంలో శనివారం జరిగిన కాల్పుల్లో ఓ గోల్ఫ్ క్రీడాకారుడు సహా మరో ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
రాష్ట్రంలోని కెన్నెషా స్టేట్ యూనివర్శిటీకి సమీపంలోని పైనెట్రీ కంట్రీ క్లబ్ గోల్ఫ్ కోర్టులో కాల్పులు జరిగాయి. పదో నంబరు హోల్ వద్ద బుల్లెట్ గాయాలతో(Gunshot) ఆ గోల్ఫ్ క్రీడాకారుడు విగతజీవిగా పడిపోయి ఉండటాన్ని అధికారులు గుర్తించారు. ఆయన్ని కంట్రీ క్లబ్లో ఉద్యోగి యూజీన్ సిల్లర్గా తేల్చారు. దీంతో సిల్లర్ మరణం పట్ల జార్జియాలోని గోల్ఫ్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా సంతాపం వ్యక్తం చేసింది. తమ క్రీడా కుటుంబం ఓ సభ్యుడుని కోల్పోయినట్లు పేర్కొంది.
ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులకు మరో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. మైదానంలోని ఓ ట్రక్కులో బుల్లెట్ గాయాలతో పడిఉన్న ఇద్దరిని పోలీసులు గుర్తించారు. వారిలో ఒకరు ట్రక్కు యజమాని కాగా.. మరో వ్యక్తి గురించి ఎలాంటి వివరాలు తెలియలేదు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే నిందితుడు ఎవరనేది ఇప్పటివరకు తెలియరాలేదని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: యుద్ధం లేకుండానే తాలిబన్ల వశమైన ఈశాన్య అఫ్గాన్