ETV Bharat / international

కరోనా విలయం.. 3.5 కోట్లకు చేరువలో కేసులు - కొవిడ్​ 19 వార్తలు

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహా విలయం కొనసాగుతోంది. కొవిడ్​ మహమ్మారి కోరల్లో చిక్కుకున్న వారి సంఖ్య 3.5 కోట్లకు చేరువైంది. ఇప్పటి వరకు 10.27 లక్షల మంది మరణించగా.. 2.56 కోట్ల మంది కోలుకున్నారు. అమెరికా, భారత్​, బ్రెజిల్​, రష్యాల్లో వైరస్​ ఉద్ధృతి అధికంగా ఉంది.

Global COVID-19
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహా విలయం
author img

By

Published : Oct 2, 2020, 9:46 AM IST

ప్రపంచ దేశాలపై కరోనా రక్కసి విషం చిమ్ముతూనే ఉంది. రోజురోజుకూ వైరస్​ బారిన పడుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇప్పటికే దాదాపు మూడున్నర కోట్ల మంది కొవిడ్​ బారినపడ్డారు. 10.27 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే క్రమంలో 2.56 కోట్ల మంది కోలుకోవటం ఊరట కలిగిస్తోంది. అమెరికా, భారత్​, బ్రెజిల్​, రష్యాలతో పాటు పలు దేశాల్లో వైరస్​ ఉద్ధృతి అధికంగా ఉంది.

మొత్తం కేసులు: 34,478,930

మరణాలు: 1,027,638

కోలుకున్నవారు: 25,666,624

యాక్టివ్​ కేసులు: 7,784,668

  • అమెరికాలో కరోనా వైరస్​ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. మహమ్మారి బారినపడిన వారి సంఖ్య 75 లక్షలకు చేరువైంది. 2.12 లక్షల మంది వైరస్​కు బలయ్యారు. ఓవైపు కేసులు పెరుగుతున్నా.. వైరస్​ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 47 లక్షల మంది రికవరీ అయ్యారు.
  • బ్రెజిల్​లో కొవిడ్​ విజృంభణ అధికంగా ఉంది. కేసుల పరంగా మూడోస్థానంలో ఉన్నా.. మరణాల్లో 1.44వేలతో రెండోస్థానంలో ఉంది. దేశంలో 48.5 లక్షల మంది వైరస్​ బారినపడ్డారు.
  • రష్యాలో కరోనా కేసుల సంఖ్య 12 లక్షలకు చేరువైంది. పాజిటివ్​ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ మరణాలను కట్టడి చేయగలిగింది అక్కడి ప్రభుత్వం. ఇప్పటి వరకు 20వేల మంది మాత్రమే మరణించారు. కేసుల పరంగా నాలుగో స్థానంలో ఉన్నా.. మరణాల సంఖ్యలో చాలా దూరంలో ఉంది.
  • కొలంబియాలో కరోనా రక్కసి వేగంగా వ్యాప్తి చెందుతోంది. మెక్సికో, స్పెయిన్​ వంటి అధిక ఉద్ధృతి ఉన్న దేశాలను దాటుకుని ఐదో స్థానానికి చేరింది. ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 8.35 లక్షలు దాటింది. 26 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కేసుల వివరాలు

దేశంకేసులు మరణాలు
అమెరికా 7,494,671212,660
బ్రెజిల్​ 4,849,229144,767
రష్యా1,185,23120,891
కొలంబియా 835,33926,196
పెరు818,29732,535
స్పెయిన్778,607 31,973
అర్జెంటినా 765,00220,288
మెక్సికో 748,315 78,078

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.