కొవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తోంది. రోజూ లక్షల సంఖ్యలో కరోనా కేసులు బయటపడుతున్నాయి. 24 గంటల వ్యవధిలో 2,59,328 కొవిడ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. 5,877 మంది మరణించారు.
- మొత్తం కేసులు 2,58,91,415
- మొత్తం మరణాలు 8,60,301
- యాక్టివ్ కేసులు 68,44,928
- రికవరీలు 1,81,86,186
- అమెరికాలో మంగళవారం 41,979 మంది కరోనా బారినపడ్డట్లు వెల్లడైంది. మరో 1,164 మంది మరణించారు. దీంతో దేశంలో కేసుల సంఖ్య 62.57 లక్షలు దాటింది. మరణాల సంఖ్య లక్షా 90 వేలకు చేరువైంది.
- బ్రెజిల్లోనూ కరోనా మరింత తీవ్రరూపం దాల్చుతోంది. కొత్తగా 41,889 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. 1,166 మంది మరణించారు. బ్రెజిల్ వ్యాప్తంగా బాధితుల సంఖ్య 39.52 లక్షలకు పెరిగింది.
- రష్యాలో బాధితుల సంఖ్య 10 లక్షలు దాటిపోయింది. కొత్తగా 4,729 కేసులు గుర్తించారు అధికారులు.
- అర్జెంటీనాలో కొవిడ్ విశ్వరూపం చూపుతోంది. ఒక్కరోజే పదివేలకుపైగా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 4.28 లక్షలకు పెరిగింది. మరో 259 మంది కరోనా ధాటికి మరణించడం వల్ల మొత్తం మృతుల సంఖ్య 8,919కి చేరింది.
- స్పెయిన్లో కొవిడ్ మరోసారి కోరలు చాస్తోంది. 8,115 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితులు 4.70 లక్షలకు చేరారు.
- కొలంబియాలో మరణాల సంఖ్య 20 వేలు దాటింది. గత 24 గంటల్లో 389 మంది మృత్యువాతపడ్డారు. 8,901 మందికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది.
వివిధ దేశాల్లో కరోనా కేసుల వివరాలు
దేశం | మొత్తం కేసులు | మొత్తం మరణాలు |
అమెరికా | 62,57,571 | 1,88,900 |
బ్రెజిల్ | 39,52,790 | 1,22,681 |
రష్యా | 10,00,048 | 17,299 |
పెరూ | 6,57,129 | 29,068 |
దక్షిణాఫ్రికా | 6,28,259 | 14,263 |
కొలంబియా | 6,24,069 | 20,052 |
మెక్సికో | 599,560 | 64,414 |