ETV Bharat / international

అమెరికాలో 50 లక్షలు దాటిన కరోనా కేసులు - corona in russia

ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయం కొనసాగుతోంది. రోజుకు దాదాపుగా మూడు లక్షల వరకు కొత్త కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అమెరికాలో కేసుల సంఖ్య 50 లక్షలు దాటింది. బ్రెజిల్​లో 30 లక్షలకు చేరువయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య కోటీ 93 లక్షలు దాటింది. 7.18 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.

Global COVID-19 tracker
అమెరికాలో 50 లక్షలు దాటిన కరోనా కేసులు
author img

By

Published : Aug 7, 2020, 7:07 PM IST

కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ధనిక, పేద దేశాలు అనే తేడా లేకుండా అన్నింటా తన ప్రభావాన్ని చూపుతోంది. రోజుకు మూడు లక్షల మంది వరకు ఈ వైరస్​ బారినపడుతున్నారు. అయితే.. అదే స్థాయిలో వైరస్​ నుంచి కోలుకోవటం ఊరట కలిగించే విషయం.

ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య కోటీ 93 లక్షలు దాటింది. 7.18 లక్షల మందికిపైగా కోలుకున్నారు.

  • మొత్తం కేసులు: 19,303,114
  • మరణాలు: 718,511
  • కోలుకున్నవారు: 12,393,763
  • యాక్టివ్​ కేసులు: 6,190,840

అమెరికాలో ఉగ్రరూపం..

అగ్రస్థానంలో ఉన్న అమెరికాలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రోజుకు 60-80 వేల వరకు కొత్త కేసులు నమోదవుతున్నాయి. మొత్తం కేసుల సంఖ్య 50 లక్షలు దాటింది. 1.62లక్షల మందికిపైగా మరణించారు. 25 లక్షల మందికిపైగా కోలుకున్నారు.

బ్రెజిల్​లో...

కరోనా కేసుల సంఖ్యలో రెండో స్థానంలో కొనసాగుతోన్న బ్రెజిల్​లో వైరస్​ వేగంగా విజృంభిస్తోంది. మొత్తం కేసుల సంఖ్య 29 లక్షలు దాటింది. మరణాల సంఖ్య లక్షకు చేరువైంది. 20 లక్షల మందికిపైగా వైరస్​ నుంచి కోలుకున్నారు.

బీజింగ్​లో తొలి స్థానిక కేసు..

చైనా రాజధాని బీజింగ్​లో స్థానిక వ్యాప్తితో తొలికేసు నమోదైంది. జూన్​ నుంచి ఇటీవల చాలా తక్కువ కేసులు నమోదయ్యాయి. తాజాగా వాయవ్య ప్రాంతంలోని షింజియాంగ్​లో 26 కొత్త కేసులు వచ్చాయి. హాంకాంగ్​లో 95 మంది కొత్తగా వైరస్​ బారినపడ్డారు.

పాక్​లో మరో 782 కొత్త కేసులు..

పాకిస్థాన్​లో కొత్త కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. శుక్రవారం 782 మంది వైరస్​ బారినపడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 2.82 లక్షలకు చేరింది. ఇప్పటి వరకు వైరస్​తో 6,052 మంది ప్రాణాలు కోల్పోయారు.

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో కరోనా వివరాలు

దేశంకేసులుమరణాలు
అమెరికా5,033,723162,836
బ్రెజిల్2,917,56298,644
రష్యా877,13514,725
దక్షిణాఫ్రికా 538,184 9,604
మెక్సికో462,69050,517
పెరు455,40920,424
చిలీ366,6719,889
కొలంబియా 357,71011,939

ఇదీ చూడండి: రికార్డ్​ స్థాయి విజృంభణ: కొత్తగా 62,538 కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.