కరోనా మహమ్మారి ధాటికి ప్రపంచ దేశాలు విలవిల్లాడుతున్నాయి. రోజురోజుకూ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. సోమవారం ఒక్కరోజే లక్షా 60 వేల కేసులు నమోదయ్యాయి. అమెరికాలో కొత్తగా 44,234 మందికి వైరస్ సోకింది. 346 మంది ప్రాణాలు కోల్పోయారు.
అక్కడ 25 వేలమందికి..
బ్రెజిల్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఒక్కరోజులో 25వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. 727 మంది ప్రాణాలు కోల్పోయారు.
మరో 6 వేలమందికి వైరస్..
రష్యాలో గడచిన 24 గంటల్లో 6719 మందికి వైరస్ సోకింది. మరో 93 మంది ప్రాణాలు కోల్పోయారు. 4 లక్షల 3 వేలమందిలో వైరస్ నయమైంది.
![world](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7826530_world.jpg)
ఇదీ చూడండి: భారత్ భూభాగంలోకి చొరబడిన చైనా