ETV Bharat / international

ప్రపంచవ్యాప్తంగా 80లక్షలకు చేరువలో కేసులు - corona virus in UK

ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌-19 ఉద్ధృతి కొనసాగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 80 లక్షలకు చేరువయ్యింది. మరణాల సంఖ్య 4.30 లక్షలు దాటింది. అమెరికాలో రోజురోజుకూ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. పాకిస్థాన్​ మాజీ ప్రధాని గిలానీకి పాజిటివ్​గా‌ తేలింది.

Global COVID-19
80లక్షలకు చేరువలో కేసులు!
author img

By

Published : Jun 14, 2020, 7:08 AM IST

కరోనా వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో విజృంభిస్తూనే ఉంది. తాజాగా 24 గంటల వ్యవధిలో లక్షా 28 వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్‌ వ్యాప్తి వేగాన్ని గమనిస్తే... మొత్తం కేసుల సంఖ్య ఒకట్రెండు రోజుల్లో 80 లక్షలు దాటిపోయే అవకాశముంది. మరోవైపు తాజాగా సుమారు 2,400 మరణాలు చోటుచేసుకున్నాయి. దీంతో మహమ్మారి కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 4.30 లక్షలు దాటింది.

మొత్తం కేసులు: 7,855,400

మరణాలు: 431,728

కోలుకున్నవారు: 4,020,473

యాక్టివ్​ కేసులు: 3,403,199

అమెరికాలో తాజాగా 25 వేల కేసులు

లాక్‌డౌన్‌ ఎత్తివేత ఫలితంగా అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా శుక్ర, శనివారాల్లో 25,396 కొత్త కేసులు నమోదైనట్టు జాన్‌ హాప్కిన్స్‌ విశ్వవిద్యాలయంలోని కరోనా వైరస్‌ రిసోర్స్‌ సెంటర్‌ వెల్లడించింది. మొత్తం కేసుల సంఖ్య 2,142,159కు చేరగా, మరణాల సంఖ్య 117,526గా నమోదైంది.

బ్రెజిల్​లో​..

బ్రెజిల్​లో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. మరణాల సంఖ్యలో బ్రిటన్​ను వెనక్కి నెట్టింది. కొత్తగా 20 వేలకుపైగా కొత్త కేసులు నమోదుకాగా, మొత్తం 8,50,796కు చేరింది. 42,791 మంది ప్రాణాలు కోల్పోయారు. 427,610 మంది కోలుకున్నారు.

రష్యాలో..

రష్యాలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది కొత్తగా 8 వేల మందికిపైగా పాజిటివ్​గా తేలింది. మొత్తం కేసుల సంఖ్య 520,129కు చేరింది. ఇప్పటి వరకు 6,829 మంది ప్రాణాలు కోల్పోయారు.

బ్రిటన్​లో..

కరోనా కేసుల సంఖ్యలో బ్రిటన్​ ఐదో స్థానంలో ఉంది. ఇప్పటి వరకు మొత్తం 294,375 మందికి వైరస్​ సోకింది. మరణాల సంఖ్య 41,662కు చేరింది. మరణాల్లో మూడో స్థానంలో ఉంది యూకే.

పాక్​ మాజీ ప్రధానికి..

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని యూసుఫ్‌ రజా గిలానీ (67)కి కరోనా సోకింది. కొవిడ్‌-19 పరీక్షల్లో తన తండ్రికి పాజిటివ్‌ ఫలితం వచ్చిందని, ఇందుకు ఇమ్రాన్‌ఖాన్‌ సర్కారుకు ధన్యవాదాలంటూ గిలానీ కుమారుడు కాశీం ట్వీట్‌ చేశారు. పాక్‌లో తాజాగా 88 మరణాలు చోటుచేసుకోగా, మృతుల సంఖ్య 2,551కు చేరుకుంది. ఇక్కడ మొత్తం కేసులు 1,32,405లకు చేరింది.

సింగపూర్​లో..

సింగపూర్‌లో ఇప్పటివరకూ 40,197 కరోనా కేసులు నమోదయ్యాయి. శనివారం ఒక్కరోజే 345 కేసులు వెలుగుచూశాయి. బాధితుల్లో కొందరు వివిధ దేశాలకు చెందిన కార్మికులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 26 మంది ప్రాణాలు కోల్పోయారు. 28,808 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.

చైనాలో మళ్లీ..

చైనాలో మరోసారి కరోనా కలకలం రేగింది. బీజింగ్‌లో కొత్తగా ఆరుగురికి కరోనా సోకడం వల్ల ఇక్కడున్న అతిపెద్ద హోల్‌సేల్‌ ఫుడ్‌ మార్కెట్‌ను మూసివేశారు. సమీపంలోని 11 నివాస సముదాయాలకు రాకపోకలను నిషేధించారు. మొత్తం కేసుల సంఖ్య 83,075కు చేరింది. మరణాలు సంఖ్య 4,634గా ఉంది. 78,367 మంది కోలుకున్నారు.

కేసుల్లో 4, మరణాల్లో 9..

అత్యధిక కేసులు నమోదైన తొలి ఐదు దేశాల్లో అమెరికా, బ్రెజిల్‌, రష్యా, భారత్,‌ బ్రిటన్‌లు నిలిచాయి. కేసుల విషయంలో నాలుగో స్థానంలోనూ, మరణాల విషయంలో 9వ స్థానంలోనూ మన దేశం ఉంది.

ఇదీ చూడండి: ఒక్కరోజు మరణాల్లో 'మహా'ను మించిన దేశ రాజధాని

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.