ETV Bharat / international

ఆగని కరోనా విలయం.. 6 లక్షలకు చేరువలో మరణాలు! - corona deaths

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. మొత్తం కేసుల సంఖ్య కోటీ 42 లక్షలకు చేరువైంది. దాదాపు 6 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా, బ్రెజిల్​, భారత్​, రష్యా, పెరు వంటి దేశాల్లో వైరస్​ వేగంగా వ్యాప్తి చెందుతోంది.

GLOBAL COVID-19 LATEST TALLY
కరోనా విలయం
author img

By

Published : Jul 18, 2020, 9:25 AM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రోజు రోజుకు కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. రోజుకు లక్షకుపైగా కొత్త కేసులు నమోదవుతున్న నేపథ్యంలో.. మొత్తం కేసుల సంఖ్య కోటీ 42 లక్షలకు చేరువైంది. సుమారు 6 లక్షల మంది మృతి చెందారు.

  • మొత్తం కేసుల సంఖ్య : 14,189,223
  • మొత్తం మరణాలు: 599,341
  • కోలుకున్నవారు: 8,455,206
  • యాక్టివ్​ కేసులు: 5,134,676

అమెరికాలో..

ఇప్పటికే కేసులు, మరణాల్లో అగ్రస్థానంలో కొనసాగుతోన్న అమెరికాలో.. వైరస్​ ఉద్ధృతి తగ్గటం లేదు. రోజు రోజుకు వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 37 లక్షలు దాటింది. మరణాలు 1.42 లక్షలు దాటాయి. 17 లక్షల మందికిపైగా వైరస్​ నుంచి కోలుకున్నారు.

బ్రెజిల్​..

కేసుల పరంగా రెండో స్థానంలో కొనసాగుతోంది బ్రెజిల్​. కొత్త కేసుల సంఖ్యలో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం కేసులు 20 లక్షలు దాటాయి. దాదాపు 78 వేల మంది మరణించారు.

రష్యాలో..

రష్యాలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోంది. కేసుల పరంగా నాలుగో స్థానానికి చేరుకుంది రష్యా. మొత్తం కేసుల సంఖ్య ఏడున్నర లక్షలు దాటింది. 12వేలకుపైగా మరణాలు సంభవించాయి.

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కేసుల వివరాలు ఇలా..

దేశంమొత్తం కేసులుమొత్తం మరణాలు
అమెరికా3,770,012142,064
బ్రెజిల్​2,048,697 77,932
రష్యా759,203 12,123
పెరు345,53712,799
దక్షిణాఫ్రికా337,5944,804
మెక్సికో331,29838,310
చిలీ326,5398,347
స్పెయిన్307,33528,420

ఇదీ చూడండి: 'ఏడు నెలల్లో జైడస్ కాడిలా కరోనా వ్యాక్సిన్!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.