ETV Bharat / international

కరోనా కాటుకు 25 లక్షల మంది బలి - ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాలు

కరోనా వైరస్​ మరణ మృదంగాన్ని మోగిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 25 లక్షల మందిని బలితీసుకుంది. మొత్తం మరణాల్లో అగ్రరాజ్యం అమెరికాలోనే 20 శాతం నమోదయ్యాయి.

global-covid-19-death-toll-surpass-2-dot-5-million
కరోనా కాటుకు 25లక్షల మంది బలి
author img

By

Published : Feb 26, 2021, 7:15 AM IST

Updated : Feb 26, 2021, 9:00 AM IST

కరోనా ప్రపంచ వ్యాప్తంగా కరాళ నృత్యం చేస్తోంది. వైరస్​ ధాటికి 25 లక్షల మంది చనిపోయారు. గురువారం మధ్యాహ్నం వరకు ప్రపంచవ్యాప్తంగా 25,01,626 మంది మృతి చెందారని హాప్కిన్స్​ విశ్వవిద్యాలయం వెల్లడించింది. అందులో అమెరికాలోనే 20 శాతం మరణాలు నమోదైనట్లు పేర్కొంది. యూఎస్​లో 5,06,500 మంది వైరస్​ ధాటికి ప్రాణాలు కోల్పోయారు. కరోనా కేసుల్లో కూడా అగ్రరాజ్యమే ముందజలో ఉంది. అక్కడ మొత్తంగా 2,83,48,259 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసుల్లో ఇవి 25 శాతం.

అమెరికా తర్వాత బ్రెజిల్​లో అత్యధికంగా 2,49,957 మంది వైరస్​కు బలయ్యారు. కరోనా మరణాల్లో మెక్సికో భారత్​ను వెనక్కి నెట్టి మూడో స్థానానికి చేరుకుంది. ఆ దేశంలో కొవిడ్​ వల్ల 1,82,815 మంది మృతి చెందారు.

అయితే 2020 సెప్టెంబర్​ 28 నాటికి ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 10 లక్షలు ఉండగా 2021 జనవరి 15 నాటికి రెట్టింపు కావడం గమనార్హం.

ఇదీ చూడండి: 'వుహాన్​ ల్యాబ్​లో చైనా సైన్యం రహస్య ప్రయోగాలు'

Last Updated : Feb 26, 2021, 9:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.