ETV Bharat / international

నాలుగు సార్లు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన 'ఫ్రాంక్లిన్​'

అత్యధిక కాలం అగ్రరాజ్యం అధ్యక్షుడిగా ఉండి చరిత్ర సృష్టించారు ఫ్రాంక్లిన్​ డి రూజ్​వెల్ట్​. వరుసగా నాలుగు సార్లు ఆయన అధ్యక్షపదవికి ఎన్నికవడం విశేషం.

author img

By

Published : Nov 2, 2020, 7:54 AM IST

Franklin D Roosevelt_America
నాలుగు సార్లు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన 'ఫ్రాంక్లిన్​'

అత్యధిక కాలం అధ్యక్షుడిగా పనిచేసిన నేతగా ఫ్రాంక్లిన్​ డి రూజ్​వెల్ట్​ చరిత్ర సృష్టించారు. ఆయన వరుసగా 1932,1936,1940,1944లో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. నాలుగో దఫా పదవిలో కొనసాగుతూనే 1945 ఏప్రిల్​12న మరణించారు. ఎన్నిసార్లయినా అధ్యక్ష పదవిని చేపట్టే అవకాశం అప్పట్లో ఉండేది. రెండుసార్లకు మించి ఈ పదవిని చేపట్టరాదని 1951లో రాజ్యాంగాన్ని సవరించారు. ఈ సవరణ అనంతరం అయిదుగురు నాయకులు.. డ్వైట్ డి ఐసెన్ హోవర్, రొనాల్డ్ రీగన్, బిల్​ క్లింటన్, జార్జి డబ్ల్యూ బుష్, బరాక్ ఒబామా రెండుసార్లు అధ్యక్షులయ్యారు.

అతి తక్కువ కాలం పని చేసిన అధ్యక్షుడు విలియం హెన్రీ హారిస్. ఒహోయోకు చెందిన హారిస్ కేవలం 31 రోజులు పదవిలో ఉన్నారు. పదవిలో ఉండి మరణించిన(1841లో) మొదటి దేశాధినేత ఆయనే.

నాడు 6% ఓటర్లే!

తొలి అధ్యక్షుడిగా వర్జీనియాకు చెందిన జార్జ్ వాషింగ్టన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన తరువాత ఏ అధ్యక్షుడూ ఇప్పటివరకు ఏకగ్రీవంగా ఎన్నిక కాలేదు. వాషింగ్టన్ ఏ పార్టీకీ చెందిన వారు కాదు. 1789 ఏప్రిల్​ 30న న్యూయార్క్​లో ప్రమాణ స్వీకారం చేశారు. 1797 మార్చి 4న పదవీ విరమణ చేశారు. రెండు దఫాలు అత్యున్నత పదవిని నిర్విహించారు. ముగ్గురు ఉత్తమ అధ్యక్షుల్లో ఒకరిగా వాషింగ్టన్​కు పేరుంది. ఒక నాయకుడు రెండు సార్లకు మించి అధ్యక్ష పదవి చేపట్టడంపై మున్ముందు చర్చించాలని ఆయన సూచించారు. ఈ సూచన చాలా కాలం తర్వాత కార్యరూపం దాల్చింది.

అమెరికా తొలి అధ్యక్ష ఎన్నిక నాటికి ఆ దేశ జనాభాలో 6 శాతం మందికి మాత్రమే ఓటు హక్కు ఉంది. చాలా రాష్ట్రాల్లో.. భూములు కలిగిన పురుషుల్లో 21 ఏళ్లు నిండిన వారు మాత్రమే ఓటు హక్కుకు యోగ్యులన్న నాటి నిబంధనలే ఇందుకు కారణం. నేడు 18 ఏళ్ల వయసుపైబడిన వారందరికీ ఓటేసే వెసులుబాటు ఉంది. వారు ఫెడరల్, రాష్ట్ర, స్థానిక ఎన్నికల్లో ఓటు వేయవచ్చు.

మహిళలకు ఆలస్యంగా..

స్వేచ్ఛ, సమానత్వం గురించి అమెరికా ఎంత గొప్పగా చెప్పుకున్నప్పటికీ మహిళల విషయంలో ఆ దేశ రాజ్యాంగం తొలుత కొంత వివక్ష ప్రదర్శించిన మాట వాస్తవం. 1920 ఆగస్టులో 19వ సవరణ ద్వారా మహిళలకు ఓటు హక్కు లభించింది. అప్పటివరకు ఎన్నికల ప్రక్రియలో మహిళలకు ఎలాంటి పాత్రలేదు. 26వ సవరణ ద్వారా 1971లో 18 ఏళ్లు నిండిన యువతకు ఓటుహక్కు కల్పించారు. అప్పటివరకు 21 సంవత్సరాలు నిండిన వారికి ఓటుహక్కు ఉండేది.

జనవరి 20నే...

అమెరికా అధ్యక్షులు ఎప్పుడు ఎన్నికైనప్పటికీ జనవరి 20నే ప్రమాణ స్వీకారం చేస్తారు. 1933 నాటి 20వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ మార్పు చోటు చేసుకుంది. అప్పటివరకు మార్చి 4న ప్రమాణ స్వీకారం చేసేవారు. శ్వేత సౌధం మెట్లపై నూతన అధ్యక్షుడి చేత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అధ్యక్షుడు ఒక చేతిలో బైబిల్​ పట్టుకుని ప్రమాణ స్వీకారం చేస్తారు.

అమెరికా రాజ్యాంగానికి రెండు శతాబ్దాలకు పైగా చరిత్ర ఉంది. 1787లో రచించారు. 1788లో ఆమోదం పొందింది. ఇప్పటికి 27 సార్లు మాత్రమే సవరించడం విశేషం. 1789 మార్చి 4న రాజ్యంగం అమల్లోకి వచ్చినప్పుడు పార్టీల వ్యవస్థ లేదు. రాజ్యాంగాన్ని చివరిసారి 1992 మే 7న సవరించారు.

ఇదీ ఓటరు చిత్రం

ప్రపంచంలో అత్యంత పురాతన ప్రజాస్వామ్య దేశంగా నిలిచిన అమెరికాలో ఓటర్లు కూడా భారీగానే నమోదయ్యారు. ఇక్కడ ఓటు హక్కు నమోదు చేసుకున్న వారి సంఖ్య 20 కోట్లకు పైనే. మొత్తం ఓటర్లలో..

  • శ్వేత జాతీయులు 69 శాతం
  • హిస్పానిక్ 11 శాతం
  • నల్ల జాతీయులు 11 శాతం
  • ఆసియన్లు, ఇతరులు 8 శాతం
  • 50 ఏళ్లు పైబడ్డ వారు 52 శాతం
  • కాలేజీ డిగ్రీ లేని ఓటర్ల సంఖ్య 65 శాతం
  • క్రైస్తవ ఓటర్లు 64 శాతం
  • ఓటర్ల సరాసరి వయసు 50 ఏళ్లు
  • అత్యధిక ఓటర్లు కలిగిన రాష్ట్రం కాలిఫోర్నియా(2.1 కోట్ల మంది).

ఇదీ చదవండి:'కొత్త వీసా విధానంతో అమెరికాకే నష్టం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.